భానుమతి ఆ సినిమా చేసుంటే సావిత్రి మహానటి అయ్యేదేనా?
ఈ విశ్వం లో ఎన్ని మార్పులు సంభవించినా,మనుషుల్లో విభిన్నమైన పోకడలు ఎన్ని వచ్చినా,చరిత్ర తన తాలూకు యొక్క రూపం మార్చుకున్నా సరే సినిమా అనేది మాత్రం ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. సినిమాలో నటించిన నటులు, నటీమణులు,సాంకేతిక నిపుణులు కూడా శాశ్వతం గా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.అలా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సినిమా మిస్సమ్మ అయితే శాశ్వతంగా నిలిచిపోయిన నటీమణి సావిత్రి.