Read more!

English | Telugu

సిల్క్ స్మితకి డాన్స్ రాదని చెప్పిన బావలు సయ్యా మరదలు సయ్యా  డాన్స్ మాస్టర్ 

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం గుర్తుండిపోయే ఆర్టిస్టుల్లో సిల్క్ స్మిత కూడా ఒకరు. యాక్టర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిల్క్ స్మిత ఆ తర్వాత ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి హీరో హీరోయిన్ల తో పాటు సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది. అసలు తమ సినిమాలో సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉండాలని నిర్మాతలు పట్టుబట్టి మరీ ఏర్పాటుచేసేవారంటే ఆమె స్టామినా ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.మరీ అలాంటి సిల్క్ స్మిత కి డాన్స్ రాదంటే మనం నమ్మగలమా? పైగా ఆ విషయం చెప్పింది ఆషామాషి వ్యక్తి కాదు. జెంట్ కొరియోగ్రాఫర్ల కి ధీటుగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పని చేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్. పైగా ఆవిడ చరిత్రలో నిలిచిపోయే  ఒక సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్ ని సిల్క్ స్మిత తో తెరకెక్కించింది.

స్వర్ణ మాస్టర్...90 వ దశకంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లోని పాటలకి ఆమె కొరియోగ్రఫీని అందచేశారు.లేటెస్ట్ గా కూడా చిరంజీవి నటించిన ఆచార్య బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి కూడా కొరియోగ్రాఫ్ ని అందించారు. కొన్ని రోజుల క్రితం స్వర్ణ మాస్టర్ ఒక యుట్యూబ్  ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో తాను కంపోజ్ చేసిన కొన్ని సినిమాల పాటల గురించి ప్రస్తావనకి వచ్చింది.ఈ క్రమంలో బావ బావమరిది సినిమాలోని బావలు సయ్యా పాట గురించి కూడా ప్రస్తావనకి వచ్చింది. ఆ సినిమాలో ఐటెం సాంగ్ గా తెరకెక్కిన ఈ పాటలో సిల్క్ స్మిత విజృంభించి నటించింది. ఈ పాటలో సిల్క్ స్మిత వేసిన స్టెప్స్ ఆమె కళ్ళతో చూసిన మత్తు చూపులు ఆరోజుల్లో తెలుగు ప్రజల మొత్తాన్ని ఒక ఊపు ఉపేలా చేసాయి. 

ఇప్పుడు ఈ పాటలోనే సిల్క్ స్మిత అసలు డాన్స్ చెయ్యలేదని, అటు ఇటు చిన్నపిల్లల్లా రెండు చేతులు ఊపడం తప్ప సిల్క్ ఏం చెయ్యలేదని స్వర్ణ చెప్పింది. పైగా సిల్క్ స్మితకి అసలు డాన్స్ కూడా రాదని స్వర్ణ మాస్టర్ చెప్పింది. కానీ సిల్క్ స్మిత బాడీ ఎక్స్ ప్రెషన్స్  తన కళ్ళతో చూసే కసి చూపులు మాత్రం సూపర్ గా ఉంటాయి. వాటితోనే సిల్క్ స్మిత తన ఐటెం సాంగ్స్ ల ద్వారా ప్రభంజాన్ని సృష్టించిందని కూడా స్వర్ణ మాస్టర్ పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో స్వర్ణ మాస్టర్ సిల్క్ స్మిత గురించి మాట్లాడిన వీడియోని చూసిన వాళ్లంతా  ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ చెప్పిన డైలాగ్ నే చెప్పుకుంటున్నారు. సిల్క్ స్మిత పెద్ద పెద్ద స్టెప్స్ వెయ్యకుండా  కామన్ ఆడియన్ ని కూడా ఓన్  చేసుకునేలా డాన్స్ చేసింది కాబట్టే బాగా పాపులర్ అయ్యిందని యాంకర్ చెప్పడంతో  స్వర్ణ మాస్టర్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది.