Read more!

English | Telugu

అక్కినేని సాంఘిక  హీరో ఏంటి అని హేళన..ఆ సినిమాతోనే రికార్డు 


ఏఎన్ఆర్ అంటేనే నటనకి ఒక డిక్షనరీ..ఎవరైనా మంచి నటుడు అవ్వాలని అనుకుంటే ఆయన నటించిన సినిమాలు చూస్తు నటనని  నేర్చుకోవచ్చు.సిల్వర్ స్క్రీన్ మీద ఆయన పోషించని పాత్ర లేదు పోషించిన అన్ని పాత్రల్లోను  జీవించి ప్రేక్షకుల దృష్టిలో ఆయా పాత్రలని సజీవంగా నిలిచేలా చెయ్యడం అక్కినేని నటనకి ఉన్న స్టైల్. మరి అలాంటి అక్కినేనిని  సాంఘిక చిత్రాల్లో నటించడానికి పనికిరాడని అన్న వారు ఉన్నారు. ఇది నిజం..నాగేశ్వరరావు అసలు సోషల్ సినిమాలకి పనికి రాడు అని అన్నారు .ఆ మాటలని పట్టుదలగా  తీసుకొని తన మొదటి సాంఘిక చిత్రంలో అత్యద్భుతంగా నటించడమే కాకుండా ఆ సినిమాలో తను  స్టైల్ గా ధరించిన కళ్ళజోడుకే స్టైల్ ని తెచ్చి కొన్ని వేల మంది చేత ఆ కళ్లజోడు కొనేలా చేసిన నటుడు  అక్కినేని నాగేశ్వరరావు గారు.

నాగేశ్వరరావు గారు తన కెరీర్ తొలినాళ్లలో జానపద ,పౌరాణిక చిత్రాలల్లోనే నటించారు. ఆయన తెలుగు చిత్ర సీమకి పరిచయమయ్యింది కూడా పౌరాణిక చిత్రం ద్వారానే. అలా అక్కినేని  అంటే కేవలం పౌరాణిక, జానపద చిత్రాల హీరోనే అనే ఒక ముద్ర ప్రేక్షకుల దృష్టిలో ఇండస్ట్రీ వర్గాల దృష్టిలో ఉండిపోయింది. కాలం తనకి కావలసింది తానే సృష్టించుకుంటుంది అనేలా ఏఎన్ఆర్ కి ఎల్ వి ప్రసాద్ డైరక్షన్ లో సంసారం అనే మూవీలో తొలిసారిగా  సాంఘిక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఎల్ వి ప్రసాద్ తో చాలా మంది మీ సినిమాలో నాగేశ్వరరావు ని తీసుకున్నారేంటి అతను సోషల్ సినిమాలకి పనికి రాడని అన్నారు. కానీ ఎల్ వి ప్రసాద్ గారు ఎవరెన్ని చెప్పినా వినకుండా అక్కినేని మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు. 

అలా సంసారం మూవీ స్టార్ట్ అయ్యింది.ఏఎన్ఆర్  తన మీద వస్తున్న విమర్శలకి చెక్ పెట్టి తానంటే ఏంటో నిరూపించుకోవాలని సినిమాలోని తన పాత్ర కోసం  ఎంతగానో కష్టపడ్డారు. ఒక దశలో జానపదాల నటుడికి   ప్యాంటు  షర్ట్ ఏంటి అని ఎగతాళి చేసిన వాళ్ళు లేకపోలేదు.సంసారం సినిమాలో నాగేశ్వరరావు  గారు వేణు అనే ఒక  పల్లెటూరి యువకుడు క్యారెక్టర్లో  ఫస్ట్ ఆఫ్ లో అమాయకంగా కొంచం మొరటుగా కనపడతాడు. అదే క్యారక్టర్ సెకండ్ ఆఫ్ వచ్చే సరికి పూర్తిగా మారిపోతుంది. వేష భాషలుతో పాటు ముఖ కవళికలు కూడా మారిపోయి పూర్తి క్లాస్ గా మారిపోతుంది.అలాంటి వేణు క్యారెక్టర్ కి అక్కినేని నూటికి నూరుపాళ్ళు  న్యాయం చేసారు. 

 అంతే కాకుండా సెకండ్ ఆఫ్ లో వచ్చే  కల నిజామాయేగా కోరిక తీరేగా అనే పాటని  ఏఎన్ఆర్ మీద చిత్రకరించడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.పైగా ఈ పాటలో అక్కినేని చాల గ్లామరస్ గా కనిపించాలి వెంటనే అక్కినేని తనే సొంతంగా  మద్రాస్ లోని మౌంట్ రోడ్ లో ఉన్న మయో ఆప్టికల్స్ కి వెళ్లి అప్పటివరకు ఉన్న గుండ్రని అద్దాలకు భిన్నంగా ఎందుకంటే అప్పటివరకు హీరోలు గుండ్రని కళ్ళద్దాలనే వాడేవాళ్లు. అలా కాకుండా తన ముఖకవలకి సరిపోయే విధంగా నలుచదరం కళ్ళద్దాలని  నాగేశ్వరరావు గారు ఎంపిక చేసుకొని తన మీద చిత్రీకరించిన పాటలో   ధరించారు.

 

ఇక అంతే  సంసారం సినిమా రిలీజ్ అయిన తర్వాత  అక్కినేని ధరించిన కళ్ళజోడు బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది అక్కినేని ఆ కళ్ళజోడు మయో ఆప్టికల్స్ లో కొన్నాడని తెలుసుకొని అక్కినేనిలా స్టైల్ గా ఉండాలని  5000 కళ్లజోడులు దాకా కొన్నారు. అందుకే అక్కినేని అభిమానులు నేటికీ ఒక మాట అంటూ ఉంటారు. తెలుగు సినిమాకి స్టైల్ ని నేర్పిందే  మా అక్కినేని నాగేశ్వరరావు అని..  ఆ తర్వాత మయో ఆప్టికల్స్ వాళ్ళు అక్కినేని కి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా చాలా సంవత్సరాలు అక్కినేనికి మాయో నుంచే  కళ్ళజోడు మోడల్స్ ని పంపించే వాళ్ళు.
 ఇలా పౌరాణిక, జానపద చిత్రాలకి  తప్ప సాంఘిక చిత్రాలకి పనికి రాడని అన్న వాళ్ళ నోరుమూయించిన ఏఎన్ ఆర్ ఆ తర్వాత ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి ఎంతగా చరిత్ర సృష్టించారో అందరికి తెలిసిందే. అన్నట్టు 1950 లో  వచ్చిన  ఈ సంసారం మూవీలో  అక్కినేని  రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడు. ఈ మూవీలో ఎన్టీఆర్, లక్ష్మి రాజ్యం, రేలంగి తదితరులు నటించారు