Read more!

English | Telugu

తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మొట్టమొదటి హీరో నాగార్జున అని మీకు తెలుసా

 

అక్కినేని నాగార్జున...అక్కినేని నాగేశ్వరరావు  నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున తన తండ్రికి తెలుగు సినిమా రంగంలో ఉన్న ఇమేజ్ కి బిన్నంగా సినిమాలు చేసి తన కంటు సొంతంగా  లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. నాగార్జున నటనకి, స్టైల్ కి అలాగే ఆయన విలన్స్ ని కోపంగా చూసే చూపుకి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాగే  పాతికేళ్ల క్రితమే నాగార్జున  తెలుగు సినిమాని పాన్ ఇండియా మార్చాడనే 
 విషయం మీకు తెలుసా?

నాగార్జున విక్రమ్ సినిమాతో తన సినీ జర్నీ ని ప్రారంభించాడు. మొదటి సినిమా అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా  నటించి తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన  చాలా సినిమాలు పెద్దగా ప్రేక్షక ఆదరణకి నోచుకోలేదు. ఏ నటుడైన తన సినిమాలు ప్లాప్ అవుతుంటే తన సినిమాల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చెయ్యడు. తాను ఇండస్ట్రీ లో నిలబడటం కోసం సేఫ్ జోన్ లో సినిమాలు చేస్తాడు .అంటే అప్పటికే ఇండస్ట్రీ లో పేరు ఉన్న డైరెక్టర్ ని పెట్టుకొని సినిమా చెయ్యవచ్చు. నాగార్జున నాగేశ్వరరావు కొడుకు కాబట్టి తను అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ నాగార్జున ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే మూస పద్దతిలో నాగార్జున సినిమాలు చెయ్యాలని అనుకోలేదు.

 అలాగే  దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఏ హీరో కూడా చెయ్యని సాహసానికి నాగార్జున పూనుకున్నాడు. అది సాహసం అనే కంటే తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తం చెయ్యడానికి నాగార్జున  సంకల్పించాడని చెప్పవచ్చు. తమిళ. మలయాళ, కన్నడ ,హిందీ భాషలకి చెందిన దర్శకులని నాగార్జున  తెలుగు తెరకు పరిచయం చేసాడు. 1989 లో వచ్చిన గీతాంజలి మూవీ ద్వారా మణిరత్నం, ప్రేమయుద్ధం ద్వారా రాజేంద్ర సింగ్ బాబు,నిర్ణయం తో ప్రియ దర్శన్, చైతన్య చిత్రంతో ప్రతాప్ పోతన్,  శాంతి క్రాంతి తో రవిచంద్రన్, కిల్లర్ చిత్రంతో ఫాజిల్, క్రిమినల్ సినిమాతో మహేష్ భట్ ఇలా పాతికేళ్ళక్రితమే పలు భాషలకి చెందిన   గ్రేటెస్ట్  డైరెకర్స్ ని నాగార్జున తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసాడు.అప్పటివరకు తెలుగు హీరో ఎవరు కూడా ఇతర బాషా దర్శకుల సినిమాల్లో నటించలేదు.కేవలం  నాగార్జున ఒక్కడే  ఎంతో దైర్యంగా వాళ్ళని తెలుగు చిత్ర పరిశ్రమకి తీసుకొచ్చి సినిమాలు చేసాడు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు నాగార్జున తెలుగు సినిమాని 25  ఏళ్ళ క్రితమే  పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లాడని. అలాగే మనీషాకొయిరాలా,జుహీ చావ్లా లాంటి  ఇతర భాషలకి చెందిన  నటీమణులని కూడా నాగార్జునే తెలుగుతెరకి పరిచయం చేసాడు.  

కళకి సంబంధించిన అన్ని జోనర్స్ లోను  నాగార్జున నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరైనా భక్తి కి సంబంధించిన సినిమా తియ్యాలంటే నాగార్జున మాత్రమే ఛాయిస్. అలాగే తన నట జీవితంలో తొమ్మిదిసార్లు నంది  అవార్డ్స్,ని  మూడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని సాధించారు. ఇప్పుడు నా సామి రంగ సినిమాతో త్వరలో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  యువ సామ్రాట్, కింగ్, మన్మధుడు లాంటి పేర్లతో ఆయన్ని అభిమానులు పిలుచుకుంటారు. ఆయన  నటించిన అన్నమయ్య సినిమా ఆస్కార్ కి ఎంట్రీ  పొందటానికి ఒక్క ఓటుతో మిస్ అయ్యింది.