Read more!

English | Telugu

ఈ సినిమా ఆడితే మహేష్ ప్రేక్షకుల దృష్టిలో హీరోనే కాదు అని చెప్పిన  కృష్ణ  

  

సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా చూసి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతుందా పోతుందా  అని ముందుగానే చెప్తారు. తన నటవారసుడు మహేష్ సినిమాల విషయంలో ఇది చాలా సార్లు రుజువయ్యింది. అలాగే కృష్ణ గారు ఇంకో వైవిధ్యమైన  జడ్జిమెంట్ ని కూడా మహేష్ కి సంబందించిన ఒక సినిమా విషయంలో చెప్పాడు.కృష్ణ గారు చెప్పిన  ఆ మహేష్ సినిమా ఏంటో చూద్దాం.

1999  లో వచ్చిన  రాజకుమారుడు సినిమాతో మహేష్  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయి కధానాయకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువరాజు ,వంశీ ,మురారి ,టక్కరిదొంగ ,బాబీ ,నిజం ,ఒక్కడు లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించాడు. ముఖ్యంగా మురారి ,ఒక్కడు లాంటి సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించడంతో పాటు కొన్ని లక్షల మంది అభిమానులని మహేష్ కి సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత నాని అనే ఒక  సినిమా వచ్చింది. అప్పటి వరకు ఉన్న భారతీయ చిత్రపరిశ్రమలో అంతకుముందెప్పుడు తెరకెక్కని ఒక  సరికొత్త ప్రయోగాత్మక కథ తో నాని రూపుదిద్దుకుంది. తమిళ చిత్ర దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2003 లో ఈ నాని చిత్రం విడుదల అయ్యింది. అప్పటికే సూర్య పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి సూపర్ డూపర్ హిట్ చేసుండటంతో నాని మీద మహేష్ ఫాన్స్ లోను, సినీ ప్రేక్షకులలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా రిలీజ్ కి ముందు  కృష్ణ గారు నాని ప్రివ్యూ వేయించుకుని చూసారు. సినిమా మొత్తం చూసిన కృష్ణ గారు ఏమని చెప్తారు అనే టెన్షన్  మహేష్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తంలో ఉంది. పైగా ఈ సినిమాని మహేష్ సోదరి మంజుల  తన తల్లి ఇందిరా దేవి పేరు మీద నిర్మించింది. సినిమా చూసిన కృష్ణ గారు సినిమా అయితే చాలా బాగుంది. మహేష్ కూడా చాలా అధ్బుతంగా చేసాడు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. ఈ సినిమా ఆడితే మహేష్ ప్రేక్షకుల దృష్టిలో స్టార్ హీరో కాదని అర్ధం. ప్లాప్ అయితే మహేష్ స్టార్ హీరో అని అర్ధం అని చెప్పారు .ఆయన చెప్పినట్లే మహేష్ ని ప్రేక్షకులు  స్టార్ గా కొలుస్తున్నారు కాబట్టే నాని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా మిగిలిపోయింది.ఎందుకు కృష్ణ గారు ఆ విధంగా చెప్పారో ఈ కథ చూస్తే అర్ధం అవుతుంది

ఒక సైంటిస్ట్ ద్వారా ఏడు సంవత్సరాల వయసు ఉన్న నాని  (మహేష్ బాబు) పెద్ద వాడిగా మారాలనే కోరికతో  28 ఏళ్ల యువకుడిగా మారతాడు. కానీ నడవడిక, మెంటాలిటీ మాత్రం చిన్న పిల్లాడిలాగే ఉంటుంది.  ఆ తర్వాత  ఒక  కంపెనీలో ఉద్యోగం సంపాందించి ఆ కంపెనీ  ఓనర్ కూతురితో( అమీషా పటేల్ ) ప్రేమలో పడతాడు. కానీ తల్లి బాధని చూడలేక  మళ్ళీ చిన్నపిల్లవాడిగా మారతాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రేమించిన అమ్మాయి కోసం  పెద్ద వాడిగా మారి తనని పెళ్లి చేసుకొని చివరికి తండ్రి అవ్వడంతో చిత్రం ముగుస్తుంది .వాస్తవానికి ఈ  కథ చాలా ఫ్రెష్ గా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. నవయువకుడుగా ,పిల్లవాడిగా మహేష్ చాలా అత్యద్భుతంగా నటిస్తాడు. అలాగే సినిమాలో మహేష్ నటన చూసి మైమరిచిపోని ప్రేక్షకుడు ఉండడు.కానీ ప్రేక్షకులు మహేష్ ని  కృష్ణ గారిలా ఒక సూపర్ పవర్ ఉన్న హీరోల భావిస్తూ ఉండటం వల్ల కృష్ణ గారు చెప్పినట్టు నాని పరాజయం పాలయ్యింది.