English | Telugu
అమర్ దీప్ కి ప్రియాంక జైన్ మధ్య ఏం జరిగింది...మీటింగ్ కి అందుకే రాలేదా?
Updated : Feb 6, 2024
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పూజామూర్తి, షకీలా, రతికరోజ్, శుభశ్రీ రాయగురు, అశ్వినిశ్రీ, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, అమర్ దీప్ చౌదరి అంతా ఓ చోట కలిసారు. ఇంకేం ఉంటాయి.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్.. గత కొంతకాలంగా బిబి హౌస్ మేట్స్ కి దూరంగా ఉంటున్నాడు. అయితే తేజస్విని గౌడతో కలిసి అయోధ్య రాముడి కోసం ఓ పాటని చేయడం అది ఫేమస్ అయింది. తేజస్విని గౌడతో బిగ్ బాస్ ముచ్చట్లు అంటూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రవితేజ గెస్ట్ గా రావడం.. సినిమాలో ఓ అవకాశం ఇస్తా వదిలేసుకొని వస్తావా అని అమర్ దీప్ ని అడగడంతో అతను ఒకే అనడం అదంతా ఫుల్ హైప్ ఎపిసోడ్ గా మారింది. అయితే తాజాగా రవితేజ తన గుర్తుగా ' ఈగల్ ' సినిమా టైటిల్ ఉన్న టీ షర్ట్ ని గిఫ్ట్ గా పంపాడంట. అది తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో కలిసి లంచ్ చేసిన ఫోటోని షేర్ చేశాడు. ఫుడ్ ఈజ్ సో యమ్మీ థాంక్స్ జాతర రెస్టారెంట్ అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. ఇక వారితో మాట్లాడిన మాటలన్నీ ఓ వ్లాగ్ గా తీసుకొస్తే బిగ్ బాస్ అభిమానులు మరింతగా చూసే అవకాశం ఉంది. తాజాగా నా సామి రంగ షోలో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ అంతా కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు.
శుభశ్రీతో కలిసి ' మనోభావాలు దెబ్బతిన్నాయి' పాటకి అమర్ దీప్ చేసిన డ్యాన్స్ రచ్చ రంబోల అయింది. ఇక శుభశ్రీ కూడా తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో కొత్త కొత్త వ్లాగ్స్ చేస్తూ అందరికి టచ్ లో ఉంటుంది. షకీలా అమ్మ ఎక్కువవా కనపడట్లేదని అందరు కలుద్దామని ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ కలిసారు. అయితే ప్రియాంక జైన్, శోభాశెట్టి ఇద్దరు ఈ మీటింగ్ కి రాకపోవడంతో అమర్ దీప్ కి వారికి మధ్య దూరం పెరిగిందా లేక వాళ్ళని అమర్ దీప్ ఇన్వైట్ చేయలేదా అనేది తెలియాల్సి ఉంటుంది.