English | Telugu

ఎన్నో ప్రశ్నలు వాటికి మీ దగ్గర సమాధానం ఉందా.. రిషి ఉన్నాడా లేడా?

అసలేం జరుగుతుంది.. ఓ సీరియల్ కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారా.. ఇంత ఫ్యాన్ బేస్ ఉందా.. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన రిషి ఎక్కడా? వస్తాడా లేదా అనే క్లారిటీ కోసం కొన్ని వేలమంది ఎదురు చూస్తున్నారు. అదేంటి ఎవరు రిషి? ఏంటా కథ ఓ‌సారి చూసేద్దాం.

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ కి డైరెక్టర్ కుమార్ పంతం. దాదాపు వెయ్యి ఎపిసోడ్ లకు చేరువలో ఉన్న సీరియల్ కి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను రిషి, వసుధారల జంటకి మరీ ఎక్కువ. అయితే గత కొన్ని నెలలుగా ఏ ఎపిసోడ్ లో రిషి కన్పించడం లేదు. ఇదే విషయం గురించి ఆ సీరియల్ ఫ్యాన్స్ డైరెక్టర్ కుమార్ పంతాన్ని ప్రశ్నించారు. డైరెక్టర్ కుమార్ పంతం ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చనింగ్ మొదలెట్టాడు. ఇందులో అభిమానులు అడిగే ప్రశ్నలు అందరిని ఆలోచింపజేసేవిలా ఉన్నాయి. " ఎన్నో ప్రశ్నలు వాటికి మీ దగ్గర సమాధానం ఉన్నదా.. రిషి సర్ వస్తాడా రాడా క్లారిటీ ? " అని ఒకరు అడుగగా.. మాకే క్లారిటీ లేదు. అందరికి చెప్తున్నా వినండి. ఇంతకముందు నేను చెప్పాను.. ఎపిసోడ్స్ బాగుంటాయని ఇప్పుడు నేనే చెప్తున్నాను. చూడాలనుకుంటే చూడండి లేదంటే వదిలేయండి. రిషి సర్ గురించి మాకు తెలియగానే ఫస్ట్ మీ అందరికి చెప్తాను. థాంక్స్ అని రిప్లై ఇచ్చాడు.

రిషి ఉన్నాడా? పోయాడా అని ఒకరు అడుగగా.. ఒక మనిషి హెల్త్ బాలేదు. అది మీ అందరికి తెలుసు. అయినా సరే మూడు నెలల నుండి సీరియల్ ని రన్ చేస్తున్నాం. తన హెల్త్ కండీషన్ ని దృష్ణిలో పెట్టుకొని స్టోరీ రాస్తున్నాం. ప్లీజ్ బీ పెషెన్స్. రెస్పెక్ట్ అవర్ వర్క్ ప్లీజ్. డోంట్ స్ప్రెడ్ నెగెటివిటి. స్పీక్ ప్రాపర్లీ అని కుమార్ పంతం రిప్లై ఇచ్చాడు. మరి గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వస్తాడా? లేక మరే కొత్త క్యారెక్టర్ అయినా రావొచ్చా చూడాలి. అయితే ఈ సీరియల్ అభిమానులు మాత్రం రిషి కావాలని కోరుకుంటున్నారు. కాగా ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.



Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..