English | Telugu

హిందీ యాక్టర్ లా ఉన్న రష్మీకి నేను ఫ్యాన్ ని


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ కలర్ ఫుల్ నెస్ కి కారణం 150 వ ఎపిసోడ్ లు పూర్తి చేసుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందులోని కమెడియన్స్ అంతా సెలెబ్రేషన్స్ తో ధూమ్ ధామ్ గా పార్టీ చేసుకున్నారు. ఇక ఈ షోకి అలనాటి సీనియర్ యాక్టర్స్ మురళి మోహన్, జయసుధను ఇన్వైట్ చేశారు. రావడంతోనే మురళి మోహన్ రష్మీని పొగిడేశారు. "ఒక హిందీ యాక్టర్ ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే" అనేసరికి రష్మీ ఫిదా ఐపోయింది. "సరిగ్గా చెప్పాలంటే నేను ఆవిడ ఫ్యాన్ ని " అంటూ ఆది చేతులు పట్టుకుని మరీ రష్మీ గురించి చెప్పారు. ఇక జయసుధను స్టేజి మీదకు పిలిచి "సిరిమల్లె పువ్వల్లె నవ్వు" అనే సాంగ్ కి డాన్స్ వేశారు ఇద్దరు. తర్వాత మురళి మోహన్ కెరీర్ ని మలుపు తిప్పిన "వారాలబ్బాయి" మూవీ సీన్ ని స్పూఫ్ గా చేశారు ఫైమా, రోహిణి అండ్ నటకుమారి టీమ్. తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కలిసి మురళి మోహన్ ని సత్కరించారు.

ఎన్టీఆర్, శోభన్ బాబు, నాగేశ్వరరావు, కృష్ణ , కృష్ణంరాజు గారి లాంటి వాళ్ళను తామంతా కలవలేకపోయాం కానీ వాళ్లందరితో పని చేసిన మురళి మోహన్ గారిని కలవడం, సన్మానించుకోవడం అదృష్టం అన్నాడు ఆది. తర్వాత రష్మీ "అందగాడా, అందగాడా" అంటూ మురళి మోహన్ కోసం సాంగ్ పాడేసింది. ఇక మురళి మోహన్ మాత్రం రష్మీ తదేకంగా అలా చూస్తూ నవ్వుతూ ఆమెతో డాన్స్ కూడా చేసారు. తర్వాత కొన్ని సాంగ్, డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయ్యాక కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. వచ్చే వారం ఈ షో ప్రసారం కానుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..