English | Telugu
Krishna Mukunda Murari : ప్రతీసారీ అలా జరగడంపై కృష్ణలో మొదలైన టెన్షన్!
Updated : Feb 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -385 లో.. కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వస్తుంటే.. ఒక పిల్లాడు బండికి ఎదరుగా వచ్చి పడిపోతాడు. అతని వెంబడి ఇంకొకతను వచ్చి.. దుప్పటి దొంగతనం చేసి పారిపోతున్నాడని కిందపడిపోయిన పిల్లాడిని కొడుతాడు. అతడిని మురారి, కృష్ణ ఇద్దరు ఆపి. ఎందుకు కొడుతున్నావని అడుగుతాడు. దొంగతనం చేసి పారిపోతున్నాడని అతను అంటాడు. ఆ తర్వాత పిల్లాడు మా అమ్మకి జ్వరం వచ్చింది. చలితో వణికిపోతుందని చెప్పగానే.. కృష్ణ, మురారి ఇద్దరు పాపమని పిల్లాడిని తన తల్లి దగ్గరికి తీసుకొని వెళ్లి దుప్పటి టాబ్లెట్స్ ఇస్తారు. మీకు ఏం అవసరం ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చెయ్యండని కృష్ణ మురారి ఇద్దరు చెప్తారు.
మరుసటిరోజు ఉదయం కృష్ణ పూజ చేస్తూ ఉంటుంది. కృష్ణ దేవునికి హారతి ఇస్తూ.. కర్పూరం బిళ్లలు కిందపడిపోవడం చూసుకోదు. అవి కిందకిపడి మంటలు వస్తుంటే అప్పుడు కృష్ణ చూసి వాటర్ పోసి ఆర్పేస్తుంది. ఏం జరుగుతుంది.. మొన్న ముకుందకి హారతి ఇస్తూ అలా జరిగింది.. ఇప్పుడు ఇలా జరిగిందని కృష్ణ బయపడుతుంది. వెంటనే మురారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంటే రేవతి చూసి.. ఏమైంది మురారికి కాఫీ తీసుకొని వెళ్ళని చెప్తుంది. అయినా కృష్ణ పట్టించుకోకుండా వెళ్తుంది. మురారి దగ్గరికి వెళ్లి.. జరిగింది మొత్తం చెప్తూ కంగారుపడుతుంది. నువ్వేం టెన్షన్ పడకని మురారి చెప్పినా కృష్ణ వినదు. గుడికి వెళ్లి పూజారి దగ్గర అడుగుదామని కృష్ణ అనగానే.. మురారి సరేనని అంటాడు.. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కిందకి వస్తూ.. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇది వరకే పెద్దమ్మ టెన్షన్ పడుతుందని మురారి అంటాడు. ఏంటి అంత హడావిడిగా వెళ్ళావని కృష్ణ లని రేవతి అడుగుతుంది. ఏసీపీ సర్ స్నానానికి వెళ్ళాడు. నేను పూజ చేస్తున్నా సడన్ గా సోప్ పెట్టలేదని గుర్తుకు వచ్చి వెళ్ళానని కృష్ణ చెప్తుంది.
ఆ తర్వాత ఎక్కడికో వెళ్తున్నారు వెళ్ళండని భవాని అనగానే.. గుడికి వెళ్తున్నామని మురారి చెప్తాడు. అయితే ఆదర్శ్, ముకుందలని తీసుకొని వెళ్ళండని నందు అంటుంది. వాళ్ళని వెళ్లనివ్వండి ఆల్రెడీ రెడీ అయి వచ్చారు కదా.. నేను అది సాయంత్రం వెళతామని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత మన ఇంట్లో బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో రెండు జంటలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారని నందు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ పూజారి గారికి కృష్ణ జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో పూజారి గారు చెప్పినట్లుగా కృష్ణ కర్పూరం వెలిగిస్తుంది. అది కూడా ఆరిపోతుంది. కృష్ణ టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో బెస్ట్ కపుల్ కాంపిటేషన్ క్యాన్సిల్ అయింది. ఇంట్లోనే మనమే ఆ కాంపిటీషన్ ని కండక్ట్ చేసుకుందామని కృష్ణ, మురారి ఇంట్లో వాళ్లకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.