English | Telugu
మోస్ట్ పాపులర్ టీవీ స్టార్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, ఆది
Updated : Feb 19, 2024
ఆడియన్స్ కి మూవీ స్టార్స్ మాత్రమే కాదు బుల్లితెర మీద ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఫాన్స్ గా ఉంటారు. అలాంటి వారిలో ది బెస్ట్ కొంత మంది ఉంటారు. మరి వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయం తెలిసింది. రీసెంట్ గా ఆర్మాక్స్ మీడియా జనవరి 2024 లో బుల్లితెర మీద టాప్ 5 సెలెబ్స్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. వాళ్ళు ఎవరంటే ఫేమస్ యాంకర్స్ ప్రదీప్, సుమ ఉన్నారు. అలాగే జబర్దస్త్ షోలో మంచి కామెడీ చేసి మూవీస్ లో కూడా నటిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర కూడా ఉన్నారు. "ఆర్మాక్స్ క్యారెక్టర్స్ ఇండియా లవ్" పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో జనవరి నెలకు తెలుగులో మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ జాబితా ఇది.
ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఈటీవీలో వచ్చే ఢీ డ్యాన్స్ షోకు ప్రదీప్ మంచి క్రేజ్ ని తీసుకొచ్చాడు. ఐతే ప్రస్తుతం ప్రదీప్ ప్లేస్ లో మరో స్పోర్ట్స్ యాంకర్ నందు హోస్ట్ గా చేస్తున్నాడు. సెకండ్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. సుధీర్ ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లాంటి షోస్ ద్వారా యాంకరింగ్ చేస్తూ, కామెడీ చేస్తూ, అప్పుడప్పుడూ సినిమాల్లో హీరోగా కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో పంచ్ లతో నవ్వించే హైపర్ ఆది ఉన్నాడు. ఆది అటు ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో పాపులర్ అయ్యాడు. అలాగే మూవీస్ లో చేస్తూ కొన్ని మూవీస్ కి పంచ్ డైలాగ్ రైటర్ గా చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో సుమ నిలిచింది. సుమ యాంకరింగ్ అంటే ఇష్టపడని ఎవరూ ఉండరు. దీర్ఘ కాలం పాటు నడిచిన క్యాష్ షోకి గాను ఈ లిస్ట్ లో ఆమె మంచి స్తానం సంపాదించుకుంది. ఇక ఐదో స్థానంలో కమెడియన్ చమ్మక్ చంద్ర నిలిచాడు. మూవీస్ ద్వారా ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. తర్వాత జబర్దస్త్ లో ప్రతీ తెలుగు ఇంటికి చేరువచ్చాడు...