English | Telugu
తను లావు అవ్వడానికి రీజన్స్ చెప్పేసిన రీతు చౌదరి!
Updated : Feb 19, 2024
సెలబ్రిటీల జిమ్ అండ్ వర్కవుట్ వీడియోలని చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది. ఆకులు , ఫూట్స్, సలాడ్స్ తో కడుపు నింపుకుంటూ వొల్లంత చెమటలు పట్టేలా కసరత్తు చేస్తే గానీ బాడీ ఓ షేప్ కి రాదని కష్టపడుతుంటారు. అలా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్తోంది రీతు చౌదరి.
కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కడికెళ్ళిన ఎవరిని కలిసిన లావు అయ్యావ్, బుగ్గలు పెరిగాయని అంటున్నారు. ఇక చాలా రోజుల మోటివేషన్ తర్వాత వర్కవుట్ చేయడం మొదలెట్టిందంట. అదే విజయాన్ని యూట్యూబ్ లోని ఓ వీడియోలో చెప్పుకొచ్చింది రీతు చౌదరి. రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతు. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడు తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. రీతు చౌదరిని ఒకడు మోసం చేశాడంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోని అప్‌లోడ్ చేయగా అది వైరల్ అయింది.
ప్రస్తుతం మరో వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది రీతు. ఇందులో తను ఏం చెప్పిందంటే.. ఈ రోజు ఉదయమే కష్టపడి లేచి లావు తగ్గడానికి వేడినీళ్ళలో నిమ్మకాయ రసం వేసుకొని తాగిందంట రీతు చౌదరి. అయితే వాళ్ళ అమ్మ మాత్రం తన ఫేవరెట్ కర్రీ అయిన సొరకాయ చేసిందంట. దానితో పాటు కొత్తగా ఆవకాయ పచ్చడి కూడా పెట్టిందంట. ఇక వేడివేడి అన్నంలో అవకాయ పచ్చడితో పాటు నెయ్యి వేసుకొని తింటే నా సామిరంగ ఉంటుందంటూ చెప్పింది రీతు చౌదరి. ఏంటి మమ్మీ అన్నీ నాకిష్టమైనవి చేస్తున్నావ్. ఇవన్నీ తింటే మళ్ళీ నేను లావు అవుతా కదా అని రీతు చౌదరి భాదపడుతుంది. అయితే ఈ వీడియోకి ప్రస్తుతం నెటిజన్ల కామెంట్లు ఎక్కువయ్యాయి.