English | Telugu

ఈ సంవత్సరం పెళ్ళి చేసుకుంటానని చెప్పిన ఫైమా!

సెలెబ్రిటీలు మాట్లాడే మాటలు, చేసే పనులు, వారి ఫోటోలు, వ్లాగ్స్ అన్నీ కూడా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. కొన్ని సందర్భాలలో వారు చేసే టూర్స్ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో ఇంటారాక్షన్ అనేది ట్రెండింగ్ లో ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ పటాస్ ఫైమా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ' ఆస్క్ మి క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది.


జబర్దస్త్ కామెడీ షోతో ఫెమస్ ఐన లేడీ కమెడియన్ ఫైమా. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. తనదైన టైమింగ్ తో తక్కువ టైంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. హౌస్ లో పది వారాల పాటు ఆడియన్స్ కు అద్భుతమైన ఎంటర్‌టైన్మెంట్ పంచింది. బిగ్ బాస్ తర్వాత ఫైమా లైఫ్ మారిపోయింది. సెలెబ్రిటీ హోదో దక్కింది. దాంతో తన సొంత ఊర్లోనే ఉంటూ వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చింది. తను ఏది చేసిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మరింత ఫాస్ట్ గా జనాలకి చేరేలా చేస్తుంది. సొంతింటి కలని తాజాగా నెరవేర్చుకున్న ఈ భామ.. ఇప్పుడు మరింతగా ఫేమస్ అయింది.

తాజాగా ఫైమా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో యూట్యూబ్ వ్లాగ్స్ తియ్యు అక్క అని ఒకరు అడుగగా.. టైమ్ లేక తియ్యట్లేదు .. త్వరలోనే స్టార్ట్ చేస్తా అని ఫైమా రిప్లై ఇచ్చింది. స్టార్ మా పరివారానికి ఇక రారా ఫైమా గారు అని మరొకరు అడుగగా.. నో.. ప్రెజెంట్ అయితే లేదని అంది. ఎవరైన నిన్ను వదిలిన నేను నీతోనే ఉంటానని ఒకరు చెప్పగా.. థాంక్స్ బ్రదర్ అని ఫైమా రిప్లై ఇచ్చింది. మీ ఏజ్ ఎంత అని ఒకరు అడుగగా.. హా చెప్పేస్తానా.‌ మీరు అడుగగానే నా ఏజ్ ఇరవై నాలుగు అని చెప్పేస్తానా ఏంటని రిప్లై ఇచ్చింది. మ్యారేజ్ ఎప్పుడు సిస్టర్ అని ఒకరు అనగా.. ఈ సంవత్సరం చేసేసుకుంటానని ఫైమా అంది. ఇలా సరదాగా కాసేపు నెటిజన్లతో కొన్ని విషయాలని షేర్ చేసుకుంది.