English | Telugu
శేఖర్ మాస్టర్ అన్న ఒక్క మాటతో కన్నీళ్లు పెట్టుకున్న సుదర్శన్ మాస్టర్....
Updated : Feb 20, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే స్టేజి మొత్తాన్ని మడత పెట్టేసి డ్యాన్సులే ఉన్నాయి. ఒకరికి మించి ఒకరన్నట్టుగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించడానికి వచ్చే వారం రాబోతోంది. ఆదర్శ్ ఐతే లేడీ గెటప్ వేసి చేసిన డాన్స్ కి జడ్జి ప్రణీత్ ఫుల్ ఫిదా ఐపోయింది. ఇక సునంద మాల డాన్స్ కి శేఖర్ మాష్టర్ ప్రతీ వారం ఫిదా ఇపోతూనే ఉంటాడు. ఇక ఈ రాబోయే వారంలో కూడా ఆయన సునంద డాన్స్ ని మెచ్చేసుకున్నాడు. డాన్స్ చాలా స్మూత్ గా అందంగా ఉంది అని కామెంట్ చేసాడు. ఇక వర్షిణి ఐతే మంచి హాట్ కాస్ట్యూమ్ తో ఎక్సలెంట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో జడ్జెస్ మనసులను దోచేసింది. వర్షిణికి డాన్స్ కోరియోగ్రఫీ చేసిన సుదర్శన్ మాస్టర్ ని స్టేజి మీదకు పిలిచాడు శేఖర్ మాస్టర్. "సుదర్శన్ ఎప్పుడు మూవీకి కొరియోగ్రాఫ్ చేస్తున్నావ్" అని అడిగేసరికి సుదర్శన్ ఒక్క నిమిషం షాకైపోయాడు. మాట్లాడలేకపోయాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. " ఈ మాట వినడానికి ఐదేళ్ల నుంచి కష్టపడుతున్నా మాస్టర్..కేవలం ఈ ఒక్క మాట కోసం" అన్నాడు సుదర్శన్.
ఇక ఈ రాబోయే వారంలో ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండబోతోందని డేంజర్ జోన్ లో జెస్సి, శ్రీప్రియ ఉన్నారని హోస్ట్ నందు చెప్పాడు. దాంతో ఇద్దరికీ వోటింగ్ ప్రాసెస్ ని పెట్టాడు. దాంతో ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం శ్రీప్రియకు ఓటేశారు తర్వాత రాఖీ అనే మరో కంటెస్టెంట్ జెస్సికి ఓటేశాడు. దాంతో శ్రీప్రియ సీరియస్ గా "రాఖీ ఒక్క పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే కాదు. అన్ని విషయాలను కూడా మనం పరిశీలించాలి కదా" అని సలహా ఇస్తుండేసరికి జెస్సికి కోపం వచ్చేసింది.."రాఖీ ఈ రోజు పెర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాడు. ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ చూసి నచ్చింది కాబట్టే చెప్తున్నాడు" అనేసరికి శ్రీప్రియ ముఖం చిన్నబోయింది. ఇక నెటిజన్స్ కూడా కొంతమంది జెస్సి ఉండాలి అంటే కొంతమంది శ్రీప్రియ ఉండాలి అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం.