English | Telugu
రష్మీ ఏంటి నీలో అందం తగ్గట్లేదు...
Updated : Feb 20, 2024
శేఖర్ మాస్టర్ ఎక్కడుంటే అక్కడ అమ్మాయిలు అతన్ని చుట్టేసి ఊపిరాడనివ్వకుండా చేస్తారు అంటూ బుల్లితెర మీద ఉన్న కమెడియన్స్ చాలా మంది సెటైర్స్ పేలుస్తూ ఉంటారు. ఐతే శేఖర్ మాస్టర్ ఒక్కోసారి అమ్మాయిల మీద చేసే కామెంట్స్ వల్లనే వాళ్ళు అలా శేఖర్ మాస్టర్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమోలో ఇలాంటి ఒక కామెంట్ చేసారు శేఖర్ మాష్టర్. శ్రీదేవి డ్రామా కంపెనీలోకి గెస్ట్ అప్పియరెన్స్ గా బుల్లితెరకి సంబంధించిన వాళ్లంతా వచ్చారు కానీ శేఖర్ మాస్టర్ ఎప్పుడూ రాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చే వారం షోలో ఆయన అలరించబోతున్నాడు. ఇక రావడంతోనే అమ్మాయిలతో డాన్స్ చేసి అందరినీ ఇంప్రెస్ చేసేసారు.
"రష్మీ రోజురోజుకూ అందం పెరుగుతుందేంటో నాకు అర్ధం కావట్లేదు" అని రష్మీని పొగిడేసాడు. ఆ కామెంట్ కి రష్మీ సిగ్గుపడిపోయి డాన్సులు చేసేసింది. ఇక ఇంద్రజ శేఖర్ మాస్టర్ మీద కౌంటర్ వేసింది.. "భూమిక ఏంటమ్మా మీ టాలెంట్ మాష్టర్ కే తెలియాలి" అనేసరికి శేఖర్ మాస్టర్ షాకై "ఇంద్రజ గారు మీరు అంటున్నది ఏ టాలెంట్ గురించి" అని రివర్స్ లో అడిగాడు.."నేను అంటున్నది భూమిక డాన్స్ టాలెంట్ గురించి మరి మీరు అనుకుంటున్న టాలెంట్ ఏంటో నాకు తెలీదు" అని ఇంద్రజ కౌంటర్ ఇచ్చింది. "భూమిక డాన్స్ టాలెంట్ గురించి ఐతే అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎందుకు అందరూ నవ్వుతున్నారు" అని పాపం అమాయకంగా అడిగేసరికి "టాలెంట్ గురించి" అంటూ రష్మీ మరో కౌంటర్ వేసింది. ఈ ఎపిసోడ్ లో ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్ ఇద్దరూ కలిసి సైంటిస్టులు గెటప్ లో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి అందులో ప్రయోగాలు చేస్తూ కనిపించారు. ఇంతకు వాళ్ళేం చేశారు...శేఖర్ మాస్టర్ డాన్స్ చూడాలంటే నెక్స్ట్ వీక్ వరకు ఆగాల్సిందే...