English | Telugu

లోకంల చదువుకున్నోళ్ళే బ్రతుకుతుర్ర? 

ఏదీ శాశ్వతం కాదు. ఏ తప్పు చేయకుండా కష్టపడి బ్రతికినా కూడా సమాజంలో నువ్వో చేతకానివాడివే అంటుందంటూ మై విలేజ్ షో రాజు చెప్పిన మాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే రాజుకి చదువబ్బక ఊర్లోనే ఉంటు ఏదో ఒక పని చేస్కుంటు బ్రతుకుతున్నాడు.

అయితే రాజు వాళ్ళ అమ్మ గంగవ్వ చేసే పనులతో అతనికి ప్రతీరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఇదీ చాలదన్నట్టు తోటివాళ్ళు అపహేళన చేయడం.. చందు అతని స్నేహితుడిగా ఉన్న కూడా తనని అర్థం చేస్కోకూండా గొడవ పెట్టుకోవడం అంతా కూడా అతనికి తీవ్ర మనస్తాపానికి గురిచేస్తుంది‌. దాంతో అమెరికాలో ఉన్న అతని మరో స్నేహితుడు అనిల్ జీలాకి కాల్ చేసి నేను బ్రతకనురా చనిపోతా అని అంటాడు. దాంతో అసలేమైందని అడుగుతాడు. నాకు జాబ్ లేదని మా అమ్మ మందు తాగిందంటూ చెప్తాడు. మరి చదువుకోరా అంటే వినలేదని అనిల్ జీలా అంటాడు. లోకంలో చదువుకున్నవాళ్ళే బ్రతుకుతుర్రా అన్న.. లేదు కదా.. ఎంతోమంది చదువుకోకుండానే ఎన్నో విజయాలు సాధించారు. మరి నాకెందుకు ఇలా అవుతుందంటూ ఊర్లో ఉన్న రాజు తన భాదని చెప్పుకుంటాడు. మరి ఏఙ చేద్దామనుకుంటున్నావని అనిల్ జీలా అడుగగా.. నాకు టూరిస్ట్ వీసా పంపించు అన్న.. అక్కడికి వచ్చి పెట్రోల్ బంక్ లో పనిచేస్తా, బాత్రూమ్ లు కడుగుతా, బస్తాలు మోస్తాను కానీ ఇక్కడ ఉండను అన్న.. నేనేంత పనిచేసిన విలువ ఇవ్వట్లేదన్న.‌. అక్కడికి వచ్చి విలువ నేర్చుకుంటా అన్న లేకపోతే ఈ కెనాల్ కాలువలో దూకి చస్తా అని రాజు అనగానే.. సరే నాకొక మూడు రోజులు టైమ్ ఇవ్వు .. నేను చెప్తాను. నీకు నేను ఉన్నానని అనిల్ జీలా అంటాడు. దాంతో రాజు సంతోషంగా వెళ్తాడు.

అయితే మూడు రోజుల తర్వాత రాజు అమెరికా వెళ్ళాడా లేదా? అసలు అనిల్ జీలా ఏం చేసాడో తెలియాలంటే ' మై విలేజ్ షో ' యూట్యూబ్ లోని ఈ వ్లాగ్ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ వీడియో. అనిల్ జీలా , గంగవ్వ, చందు, రాజు ఇలా కొంతమంది చేసే ఇలాంటి వ్లాగ్స్ కి యూట్యూబ్ లో తెగ వ్యూస్ వస్తున్నాయి. ‌ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వ్లాగ్ మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.