English | Telugu

లైఫ్ ని కొత్తగా మార్చుకుంటున్న ఇనయా సుల్తానా!

ప్రతీ ఒక్కరి లైఫ్ భిన్నంగా ఉంటుంది. ఏది ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాదు. నిన్న మొన్నటి దాకా యావరేజ్ గా ఉన్నవాళ్ళు నేడు మెరుగ్గా మారవచ్చు . అందుకే సక్సెస్ ఎప్పుడు స్ట్రగుల్స్ లో నుండే వస్తయంది‌. అలా కష్టపడుకుండా వచ్చిందేది శాశ్వతం కాదని ఇనయా సుల్తానా నిరూపిస్తోంది.

అసలు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వారు కూడా బిగ్ బాస్ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సీజన్ సిక్స్ లో ఇనయా ముజిబుర్ రహమాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పి‌న ఇనయా‌‌.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన పర్ఫామెన్స్ తో తనకంటు ఫ్యాన్ బేస్ పెంచుకుంది. బిగ్ బాస్ షో తర్వాత కుకింగ్ వీడియోలని, ట్రావెలింగ్ అంటు జర్నీ వీడియోలని పోస్ట్ చేసింది ఇనయా. ఇక సోషల్ మీడియా నుండి చాలా గ్యాప్ తీసుకొని జిమ్ లో వర్కవుట్ లు చేసే వీడియోలోని గత రెండు మూడు రోజులుగా పోస్ట్ చేస్తుంది. మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో కొంతమంది తన లైఫ్ ఎలా ఉందని అడిగితే వారికోసం ఓ రీల్ ని చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇనయా. జోరుగుతున్నదో జారుతున్నదో జన్మకేమైందో.. ఊహ నిజములా.. నిజము ఊహలా‌. తోచి తోసినాయా అంటూ ఓ పాట బ్యాక్ గ్రౌండ్ లో ఆడ్ చేసుకొని అప్లోడ్ చేసింది. అదే తన లైఫ్ అని .. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని ఇనయా ఈ రీల్ లో చెప్పుకొచ్చింది. మరి ఇనయా సుల్తానా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ లేటెస్ట్ వీడియోని మీరు చూసారా అయితే కామెంట్ చేయండి.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.