English | Telugu
అరె ఏంట్రా కామెంట్స్.. నవ్వి నవ్వ సచ్చిపోతే ఎవడ్రా గ్యారెంటీ!
Updated : Mar 4, 2024
చిన్ను నాన చిన్ను .. పాట ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ చేసేవారికి అందరికి తెలుసు. అలాగే వహ్ అన్న వహ్ అని వేణు మాదవ్ చెప్పే డైలాగ్.. పిచ్చోళ్ళ గురించి వినడమే గానీ లైవ్ లో చూడటం ఇదే ఫస్ట్ టైమ్ .. నాకో గన్ ఇస్తారా.. ఆ అందానికి ఆ ఫేస్ కట్ కి మనమిచ్చే వాల్యూ ఎంతండి.. ఇలాంటి మీమ్స్ అన్ని మనం నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో చూస్తుంటాం.
అసలు మ్యాటర్ ఏంటంటే ఇలాంటి మీమ్స్ కంటెంట్ అంతా కలిపి గీతు రాయల్ ఓ వ్లాగ్ చేసింది. అసలేంటంటే తను చేసిన ఓ వ్లాగ్ కి వచ్చిన కామెంట్లని చదువుతూ ఇన్ స్టాగ్రామ్ మీమ్స్ అన్నింటిని వాడేసింది. యాంకర్ ధనుష్ తో కలిసి గీతు రాయల్ ఓ యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో వీరిద్దరు కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తున్నారు. అవి ట్రెండింగ్ లోకి వెళ్తున్నాయి. తాజాగా వాళ్ళిద్దరు కలిసి చేసిన ' అరెయ్ ఏంట్రా ఈ కామెంట్స్ . పాయింట్ ఏంటంటే ' అనే వ్లాగ్ ట్రెండింగ్ నెంబర్ 29 కి వచ్చింది. దాని గురించి మాట్లాడుతూ గీతు రాయల్, ధనుష్ ఇద్దరు వ్లాగ్ ని అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళ ఛానెల్ కి యూట్యూబర్స్ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. అలా వదిలేయకండి రా ఎవరికైనా చూపించండ్రా అని ఒకరు.. హాయ్ అక్క నేను కేశవరెడ్డి స్కూల్ అని మరొకరు. పిచ్చి అంటారండి అని మరొకరు.. శ్రీహాన్, శ్రీసత్యలతో కలిసి వ్లాగ్ చేయండి అని ఇంకొకరు.. ఇలా తమ వ్లాగ్స్ కి వచ్చిన కామెంట్లని చదువుతూ మరో వ్లాగ్ చేసింది గీతు. కాగా ఇప్పుడు ఇది యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.
బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు తను చేసిన ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీలో ఎంతమంది ఈ వ్లాగ్ చూసారో కామెంట్ చేయండి.