English | Telugu

పండంటి కాపురానికి 12 సూత్రాలు...పిల్లలు ప్లానింగ్ ఇప్పుడే లేదు!


నేహా చౌదరి కొత్తగా పెళ్ళై ఫారెన్ లో తన భర్తతో కలిసి హ్యాపీగా ఉంటోంది. ఐతే ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. పండంటి కాపురానికి 12 సూత్రాలు నేర్చుకోవడానికి. పెళ్లయ్యాక ఇద్దరూ కలిసున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దానితో పాటు మంచి రెసిపీస్ కూడా నేర్చుకుంది. పెళ్లయ్యాక ప్రతీ విషయం అమ్మతో షేర్ చేసుకోవాలని అనుకోకూడదు. ఎందుకంటే అమ్మ ప్లేస్ లో హజ్బెండ్ వస్తాడు. కూర్చుని పాలు నీళ్లలా కలిసిపోయి మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి.

ఇప్పటి జెనెరేషన్ పిల్లలకు ఓపిక చాలా తక్కువగా ఉంటోంది..అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఏమీ ఉండడం లేదు.. అందుకే ఇళ్లల్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి అంటూ నేహా వాళ్ళ అమ్మ చెప్పింది. "మొదట్లో అనిల్ నాతో టైం స్పెండ్ చేయడం లేదని చాలా ఫీలయ్యా...గొడవలు కూడా అయ్యాయి..కానీ రానురాను నేను అర్ధం చేసుకున్నది ఏంటంటే అనిల్ కి క్రికెట్ అంటే ఇష్టం. దాని మీద తప్ప ఇంకా దేనిమీదా టైం స్పెండ్ చేయడు..అందుకే గొడవలు ఎందుకు అని నేనే తనతో క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశా. దాంతో అనిల్ కూడా క్రికెట్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాడు. అలా ఇప్పుడు ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం..ఇప్పుడు అందరూ నన్ను బాగా వెయిట్ గెయిన్ అవుతున్నావ్ ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. కానీ కాదు..మాకు ఇప్పుడే పిల్లల గురించి ఆలోచన చేయడం లేదు. అనిల్ కి వరల్డ్ టూర్ చేయాలనీ ఉంది. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఒక రెండేళ్ల వరకు పిల్లల గురించి ఆలోచించం. ఇప్పుడు కట్టాల్సిన ఈఎంఐలు చాలా ఉన్నాయి. అవన్నీ ఐపోయాక కొంత సేవింగ్స్ చేసాక అప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాం అది సంగతి. పేరెంట్స్ తో పిల్లలకు అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి..ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏ విషయాలనైనా పేరెంట్స్ పిల్లలు షేర్ చేసుకునేలా చేయాలి..అప్పుడే పిల్లలు చక్కగా ఎదుగుతారు..నాకు మా పేరెంట్స్ తో ఆ అటాచ్మెంట్ ఉంది" అని చెప్పింది నేహా.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.