English | Telugu

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన రీతు చౌదరి!

కొంతమంది సెలబ్రిటీలు బరువు తగ్గడానికి బాగా కష్టపడుతుంటారు. వర్కవుట్ , జిమ్, యోగా, వాకింగ్ రన్నింగ్ అంటూ బాడీతో కుస్తీ పడుతుంటారు. సినిమా అవకాశాల కోసం నటీమణులే ఎక్కువ కష్టపడుతుంటారు. వారిలో బుల్లితెర టీవీ యాంకర్ లు మరీను. ఎందుకంటే బుల్లితెరపై క్రేజ్ ఉన్న షోలు రెండు మూడు మాత్రమే వాటిల్లో యాంకర్ గా సెలెక్ట్ అవ్వాలంటే లావు, సన్నగా ఉంటే సరిపోదు.. చూడాటనికి అందంగా ఉండాలి వాటి కోసం ఎన్ని కసరత్తులు అయిన చేయాలి.

ఇప్పుడు అవకాశాల కోసం రీతు చౌదరి డైట్ చేస్తోందంట. పొద్దున్నే లెమన్, కీరా, హానీ కలిపిన వాటర్ ని తాగుతూ వర్కవుట్ చేస్తుందంట రీతు. అదే విషయం తన వ్లాగ్ లో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అయితే అది ఎలా వాడాలో? ఎంత తాగాలో‌ చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది బాయ్స్ మాత్రం తను చెప్పుంది వినకుండా.. ఫోకస్ ఆన్ గోల్స్ అంటు కామెంట్లు చేస్తున్నారు. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.