English | Telugu

జబర్దస్త్‌ షో నుంచి తప్పుకోవడానికి అసలు రీజన్‌ అదే : సౌమ్యారావు

తెలుగు టి.వి. ఛానల్స్‌లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షో ‘జబర్దస్త్‌’. 2013లో ప్రారంభమైన ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్‌ తమ టాలెంట్‌ని ప్రదర్శించి మంచి పేరుతో పాటు ఆర్థికంగా సెటిల్‌ అయినవారు ఉన్నారు. ఈ షోలో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోకి, ఇతర శాఖల్లోకి వెళ్లినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న అనసూయ జబర్దస్త్‌ షోకి చాలా కాలం యాంకర్‌గా పనిచేసింది. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తుండడంతో ఈ షోను పక్కన పెట్టి సినిమాల్లోనే సెటిల్‌ అయిపోయింది. దాంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి యాంకర్‌గా ఉన్న రష్మీగౌతమ్‌ జబర్దస్త్‌ షోని కూడా చాలా కాలం నిర్వహించింది. ఆ తర్వాత జబర్దస్త్‌ షోకి సీరియల్‌ నటి సౌమ్యారావుని తీసుకున్నారు. అనసూయ, రష్మీలకు ఉన్నంత గ్రాస్పింగ్‌ పవర్‌, ఛరిష్మా సౌమ్యకు లేకపోయినా సంవత్సరం పాటు షోలో కొనసాగింది. ఇదిలా ఉంటే.. ఆమె స్థానంలోకి సిరి హనుమంత్‌ వచ్చి చేరింది. ఏడాది కూడా కాకుండానే సౌమ్య ఈ షో ఎందుకు గుడ్‌బై చెప్పింది అనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనిపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సౌమ్య.

‘నాకు తెలుగు భాష మీద అంత పట్టు లేదు. అంతేకాదు, స్టెప్స్‌ వెయ్యడంలో కూడా ఇబ్బంది పడేదాన్ని. అందుకే డాన్స్‌ నేర్చుకోవడానికి కూడా వెళ్లాను. అసలే సన్నగా ఉన్న నేను డాన్స్‌ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా మారిపోయాను. దాంతో జబర్దస్త్‌ మేనేజర్‌ ‘మీరు డాన్స్‌ చెయ్యకండి. దాన్ని ఎలాగోలా మేనేజ్‌ చెయ్యొచ్చు. మీరు ఇంకా సన్నగా అయితే బాగోదు’ అని సలహా ఇచ్చారు. అదీకాక నాకు తెలుగు సరిగా రాకపోవడంవల్ల కొన్ని స్కిట్స్‌ అర్థంకాక ఎంజాయ్‌ చెయ్యలేకపోయాను. తెలుగు రాకపోవడం, డాన్స్‌ తెలియకపోవడం.. ఈ రెండు కారణాల వల్లే జబర్దస్త్‌ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అని వివరించింది సౌమ్యారావు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.