English | Telugu

కెమెరామ్యాన్ నిరుపమ్ తో మంజుల..కూర్గ్ తోటల్లో


నిరుపమ్ పరిటాల ఫామిలీ కూర్గ్ కాఫీ తోటల్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ కి వెళ్లి అక్కడి నుంచి క్యాబ్ లో కూర్గ్ కి వెళ్లినట్లు చెప్పింది మంజుల. "డైరెక్ట్ ఫ్లయిట్ లేదు కూర్గ్ కి. ఇక దారంతా కూడా ఫుల్ ఘాట్ రోడ్. పర్మిషన్ అది తీసుకోవాలని చెప్పి మా డ్రైవర్ అడుగుతూ వచ్చాడు. ఐతే వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు..మాకేమో మలయాళం రాదు అర్ధం కాదు. అదేం అర్ధం కాక నిరుపమ్ తమిళ్ లో చెప్తున్నారు. సరే అని వాళ్లకు మేము చెప్పేది అర్ధమవుతుందో లేదో కూడా మాకు తెలీదు.

ఏదోలా కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చేసాం. ఇక వచ్చాక ఇక్కడ ప్లేస్, వాతావరణం చాలా బాగుంది. దారంతా మేము పడిన అవస్థ మొత్తాన్ని మర్చిపోయాం అంత బాగుంది ఈ ప్లేస్. ఇక ఈ ప్లేస్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళబుద్ధి కావడం లేదు..ఇన్ డోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అలాగే కూర్గ్ లో బటర్ ఫ్లై అనే రిసార్ట్ ని బటర్ ఫ్లై థీమ్ తో కట్టారు. డ్రోన్ వ్యూలో దీన్ని చూస్తే బటర్ ఫ్లై వింగ్స్ షేప్ లో కనిపిస్తుంది. ఇక్కడి రూమ్స్ కి, రిసార్ట్స్ కి బటర్ ఫ్లైస్ కి సంబంధించిన పేర్లే ఎక్కువగా పెట్టారు . ఇదొక హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా గ్రీనరీ, చెట్లు, లాన్స్ అన్నీ ఉన్నాయి. ఇది 34 ఎకరాల్లో విస్తరించి ఉంది. అడవి మధ్యలో ఉంది కాబట్టి చుట్టూ పక్షుల అరుపులు తప్ప పెద్ద శబ్దాలు ఏమీ వినిపించవు . అంతా ప్రశాంతంగా ఉంటుంది.

మార్నింగ్ 11 కి ఈవెనింగ్ 4 కి ప్లాంటేషన్ వాక్ అని ఉంటుంది. కాఫీ తోటల్లోని రకరకాల వాటి గురించి వివరిస్తూ ఉంటారు ఇక్కడి గైడ్స్. కాఫీ చెట్లకు నీడ ఉండడం కోసం మధ్యమధ్యలో పెద్ద పెద్ద చెట్లను పెంచుతారు...ఇక్కడ గాంధారి చిల్లీతో చేసే లోకల్ వైన్ చాలా ఫేమస్. మంచి ఘాటుగా ఉండే ఈ వైన్ వన్ కేజీ వెయ్యి రూపాయలు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడి ప్లేసెస్ అన్ని తిరిగేసి అలిసిపోతాం కానీ కూర్గ్ లో అలా కాదు..అన్ని యాక్టివిటీస్ ఇక్కడే ఉంటాయి. చెట్లు అవీ ఉండడం వలన పెద్ద అలసటగా అనిపించదు. చాలా హాపీగా ఉంటుంది ట్రిప్ చాలా రిలాక్స్ అవ్వొచ్చు ఈ కూర్గ్ తోటల్లో" అని చెప్పారు మంజుల-నిరుపమ్.