English | Telugu

దేవుడేం కళ్ళు మూసుకుని కూర్చున్నాడా...ఇందుకా మేం పూజలు చేసేది!

పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక హత్యాచార ఘటన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద చాలా మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహిళా దినోత్సవం, శివరాత్రికి ఒక రోజు ముందు జరిగిన ఈ ఘటనతో తల్లితండ్రులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం మీద ఇప్పుడు కీర్తి భట్ స్పందించింది. "దేవుడికి రోజూ మనం పూజలు చేస్తాం...నైవేద్యం పెడతాం...ఎందుకు ఇలా చేస్తాం మమ్మల్ని బాగా చూడాలని.. కష్టాల్లో ఉంటే ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడనే కదా. మరి ఇప్పుడు దేవుడు ఎందుకిలా చేసాడు.

ఒక చిన్నారిని అంత మంది కలిసి అత్యాచారం చేసినప్పుడు ఆమె ఎంత బాధను అనుభవించి ఉంటుంది. ఇలాంటి టైంలో హెల్ప్ అవని దేవుడు ఎందుకు..? ఆస్తులు ఉన్నవాళ్ళకి దేవుడు ఇంకా ఆస్తి ఇస్తూ ఉంటాడు...లేనివాళ్లకు ఇవ్వనే ఇవ్వడు...ఏదో ఒక చిన్న రూపంలో ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి ఆమెను కాపాడొచ్చుగా..ఆమెకు తప్పించుకునే మార్గం చూపించొచ్చుగా..పసిపిల్లలను దేవుడితో సమానం అంటారు..అలాంటి చిన్నారి మీదనే రేప్ అటెంప్ట్ జరిగింది. ఇలాంటి వినడానికేనా ఉదయాన్నే లేచి పూజలు చేయాలి..నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నాకు ఇంట్లో ఉన్న దేవుడు ఫోటోలను బయట పెట్టేయాలనిపిస్తోంది. దేవుడు మనకు కనిపించడు...చిన్నారి అంత బాధను అనుభవిస్తున్నా దేవుడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె బాధను చూసిన నెటిజన్స్ చాలామంది కామెంట్స్ చేశారు. "దేవుడు ఉన్నాడు దుర్మగులు ఉన్నారు మన లైఫ్ ఎలా ఉండాలో ఆల్రెడీ డిసైడెడ్ మనం ఎం చెయ్యలేం మానవత్వంగా ఉండడం తప్ప ... ట్రూ వర్డ్స్ కీర్తి మా లైఫ్ లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసేప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ లో లేని దేవుడు ఇంకెందుకు అన్పిస్తుంది ..." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.