English | Telugu
ఎటో వెళ్ళిపోయింది మనసులో కీలక మలుపు.. మాణిక్యం చెప్పిన కండిషన్ కి సీతాకాంత్ షాక్!
Updated : Mar 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో.. సీతాకాంత్ ఫ్యామిలీని పిలిచి మరీ మాణిక్యం అవమానిస్తాడు. సిరి, ధనల పెళ్లి జరగాలంటే నాది ఒక కండిషన్.. అది ఒప్పుకుంటే నేను వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటానని మాణిక్యం అనగానే.. ఏంటి చెప్పు అని సీతాకాంత్ అంటాడు. నేను ఇప్పుడే చెప్పను.. రేపు చెప్తాను. నేను మొన్న ఎలా టెన్షన్ పడ్డానో.. మీరు పడాలి కదా అని మాణిక్యం అంటాడు. ఇక నేను మాట్లాడడం పూర్తి అయిందని మాణిక్యం అంటాడు.
ఆ తర్వాత సీతాకాంత్ ఫ్యామిలీ వెళ్లిపోయాక.. ఎందుకు ఇలా చేస్తున్నావ్? మళ్ళీ కండిషన్ ఏంటి అని మాణిక్యంపై కోప్పడుతుంది. అసలు సీతాకాంత్ సర్ వాళ్ళు ఎందుకిలా ఇంత తగ్గి ఓపికగా ఉన్నారని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత మాణిక్యం చేసిన అవమానానికి చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే సందీప్ వచ్చి.. అసలు వాడి కండిషన్ ఏమై ఉంటుందని శ్రీలతని అడుగుతాడు. సిరి కోసం సీతాకాంత్ ఏమైనా చేస్తాడు. నన్ను ఎదిరించి మరీ వాళ్ళ పెళ్లి చేస్తాడు. అందుకే అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలని నేను మాణిక్యం ఇంటికి వెళ్ళానని సందీప్ కి శ్రీలత చెప్తుంది. మరొకవైపు మాణిక్యం కండిషన్ ఏంటి సీతాకాంత్ తన తాతయ్యని అడుగుతాడు. ఇన్నిరోజులు వాడి కోసం తిరిగావ్ కదా.. అందుకే ఇక తనకి నీ వల్ల భయం ఉండకూడదని కావచ్చేమోనని పెద్దాయన చెప్తాడు.
మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ తన ఫ్యామిలీని తీసుకొని మాణిక్యం ఇంటికి వస్తాడు. అసలు ఇప్పుడు చెప్పు నీ కండిషన్ ఏంటని సీతాకాంత్ అడుగుతాడు. ధన మీ ఇంటికి ఇల్లరికం రావడం ఇష్టమే. కానీ సిరి ధనల పెళ్లి జరగాలంటే సీతాకాంత్ నా కూతురు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని అనగానే అందరు షాక్ అవుతారు. సీతాకాంత్ మాణిక్యంపై కోప్పడతాడు. అసలు జరగదని సీతాకాంత్, శ్రీలత అంటారు. అయితే సిరి, ధనల పెళ్లి కూడా జరగదని మాణిక్యం అనగానే.. సీతాకాంత్ మాణిక్యం గొంతు పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.