English | Telugu

ఇళయరాజాతో శృతి హాసన్ బ్యూటిఫుల్ మెమరీ అదేనంట

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సెమీ ఫినాలే ఎపిసోడ్ లో శృతి హాసన్ ఇళయరాజా గారితో ఉన్న తన అనుబంధం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. "శృతి మేడం...మీరు చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు కదా మీ ఫస్ట్ మెమరబుల్ అండ్ మీ మనసుకు దగ్గరైన ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి ? అని సృష్టి చిల్లా అడిగింది. "ఇంట్లో నాన్నగారు ఎప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు. మా ఇంట్లో మొత్తం మ్యూజిక్ ఉంది. ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ గుర్తుండే మెమరీ నా ఫస్ట్ రికార్డింగ్ అది కూడా ఇళయరాజా సర్ తో జరిగింది నా ఐదేళ్ల వయసులోనే. ఆ వయసులో నాకు ఆ రికార్డింగ్ గురించి దాని వేల్యూ గురించి నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఐతే నాకు ఒక విషయం బాగా గుర్తుంది.

బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కి అనుష్క డుమ్మా..రెమ్యునరేషన్ ఎంత అడిగింది 

హీరోలకి అభిమానులు వీరాభిమానులు ఉండటం కామన్. కానీ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యే సినిమాకి కూడా ఆ రెండు క్యాటగిరీస్ కి చెందిన వారు ఉంటారని కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయి. పైగా అందులోని క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకులు తమ సొంత వాళ్ళ లాగా భావిస్తారు. అలాంటి ఒక చిత్రమే బాహుబలి(Baahubali). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, ఈ నెల 31 న బాహుబలి ది ఎపిక్ (Baahubali The Epic)గా వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ప్రీమియర్స్ కూడా ఈ రోజు సాయంత్రం నుంచే పడటంతో అభిమానుల ఆనందానికి  కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.