English | Telugu
రాజా సాబ్ సాంగ్స్.. ఫస్ట్ సింగిల్ ఫెయిల్.. మరి సెకండ్ సింగిల్..?
Updated : Dec 18, 2025
రాజా సాబ్ సాంగ్స్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు
నిరాశపరిచిన ఫస్ట్ సింగిల్!
సెకండ్ సింగిల్ అంచనాలు అందుకుందా?
'ది రాజా సాబ్'(The Raja Saab) ఆల్బమ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్నో అంచనాలు ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని ముందు నుంచి మూవీ టీమ్ చెబుతుండటంతో.. డార్లింగ్, మిర్చి రోజులను గుర్తుచేసేలా అదిరిపోయే సాంగ్స్ ఉంటాయని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఫస్ట్ సింగిల్ ఫెయిల్ అయింది.
తమన్ సంగీతం అందిస్తున్న 'రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'రెబల్ సాబ్'(Rebel Saab) సాంగ్ నవంబర్ లో విడుదలైంది. రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్.. తీరా రిలీజ్ అయ్యాక బాగా డిజప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా సాంగ్ లేదని మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ విడుదలయ్యాయి. దాదాపు ఆ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచి, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ లిస్టులో 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ చేరకపోవడం.. అభిమానులను నిరాశపరిచింది.
Also Read: 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్.. ఇది కదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే..!
ఇప్పుడు 'రాజా సాబ్' నుంచి సెకండ్ సింగిల్ గా 'సహనా సహనా'(Sahana Sahana) అనే పాట వచ్చింది. ప్రోమోతోనే ఈ మెలోడీ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుల్ సాంగ్ కి కూడా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' స్థాయిలో కాకపోయినా.. సహనా సాంగ్ బాగానే ఉందని, ఇది స్లో పాయిజన్ లా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మొత్తానికి 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ తో అభిమానులను నిరాశపరిచిన తమన్.. సెకండ్ సింగిల్ తో మంచి స్పందననే రాబడుతున్నాడు. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయో చూడాలి.