స్టార్ కిడ్ చేతికి విజయ్ చేయాల్సిన భారీ ప్రాజెక్ట్..!
ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్ట్, మరో హీరోకి వెళ్ళడం అనేది చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు కాంపౌండ్ లో ఇది ఎక్కువగా వినిపిస్తోంది. 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ విషయానికొస్తే.. నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. అలాగే ఇప్పుడు 'జటాయు' కూడా ఓ కొత్త హీరో తలుపు తట్టినట్లు తెలుస్తోంది.