ఆస్కార్ అవార్డ్స్ లో గ్యాంబ్లింగ్.. తెలుగువారు మిమ్మల్ని ఆదరించారని మర్చిపోకండి
భారతీయ సినీ రంగంలోని లెజండ్రీ నటుల ప్రస్తావనకి వచ్చినప్పుడు అందులో 'పరేష్ రావెల్'(Paresh Rawal)పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు చిత్ర ప్రేమికులకి కూడా సుదీర్ఘ కాలం నుంచి పరిచయమే. ముఖ్యంగా మనీ, గోవిందా గోవిందా, శంకర దాదా ఎంబిబిఎస్ వంటి చిత్రాల్లోని నటనతో అయితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయాడు. కొంత కాలం గ్యాప్ తర్వాత రీసెంట్ గా రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ల 'థామా'(Thamma)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటాడు.