English | Telugu
ధురంధర్ మూవీ డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్
Updated : Dec 18, 2025
-ఎవరు ఆ హీరోయిన్
-ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
-రికార్డు కలెక్షన్స్
ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్'(Dhurandhar)తన ప్రభంజనాన్ని యధావిధిగా కొనసాగిస్తోంది. డిసెంబర్ 5 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టగా ఇప్పటి వరకు నాలుగువందల కోట్లకి పైగా సాధించి ఐదువందల కోట్ల మార్కుకి చేరువలో ఉంది. ప్రేక్షకులతో పోటాపోటీగా సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రటీస్ కూడా ధురంధర్ ని వీక్షిస్తుండటంతో ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు 'ఆదిత్య దర్'(Aditya Dhar)కి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
ఆదిత్య దర్ భార్య ప్రముఖ హీరోయిన్ 'యామి గౌతమి'(Yami Gautam). సినిమాల్లోకి రాక ముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించగా 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011 లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్విలా' చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమవ్వగా, ఆ తర్వాత అల్లు శిరీష్ డెబ్యూ మూవీ 'గౌరవం', తరుణ్ తో యుద్ధం, నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. పలు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా చేసి తన సత్తా చాటగా, 2024 లో తనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ 370 చిత్రంతో సోలో విజయాన్ని అందుకుంది. ఇక 2019 లో ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉరి' అనే చిత్రంలో చేసిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య దర్ మొదటి మూవీ కూడా అదే. జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.
Also read:థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన టీమిండియా క్రికెటర్లు.. ఫ్యాన్స్ హంగామా
ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆదిత్య దర్ నిర్మాతగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ధూమ్ ధామ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ తో హక్ అనే సినిమాలో చెయ్యగా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య దర్ కెరీర్ విషయానికి వస్తే ఉరి తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి చిత్రాలకి రైటర్ గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత 'ధురంధర్' తో వచ్చి ఇండియా సినిమా తన వైపు చూసేలా చేసుకున్నాడు.