English | Telugu
మనమంతా మానవ మాత్రులం.. అవతార్ 3 పై సుకుమార్ కీలక వ్యాఖ్యలు
Updated : Dec 18, 2025
-సుకుమార్ ఏం చెప్పాడు
-అవతార్ 3 రిజల్ట్ ఎలా ఉంది!
-భావోద్వేగం తప్పదా!
'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar fire and ash)తో జేమ్స్ కామెరూన్ (James Cameron)మరోసారి సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసే టైంకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండటంతో అవతార్ ప్రేమికులతో పాటు సినీ ప్రేమికుల్లో సందడి వాతారణం నెలకొని ఉంది. ఇప్పటికే కొంత మంది సినీ ప్రముఖులకి అవతార్ ఫైర్ అండ్ యాష్ టీం ప్రత్యేక షో ని ప్రదర్శించి చూపించడం జరిగింది. వాళ్ళల్లో ప్రముఖ దర్శకుడు 'సుకుమార్'(Sukumar)కూడా ఒకరు. దీంతో ఆయన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఎలా ఉందో చెప్పడం జరిగింది.
సుకుమార్ మాట్లాడుతు 'సినీ దర్శకుల్లో జేమ్స్ కామెరూన్ ఒక అవతార్ అయితే మిగతా వారంతా మానవ మాత్రులం. మూవీ చూస్తుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి. మూడుగంటల పదిహేను నిముషాలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఫ్యామిలీతో అందరూ చూసే సినిమా. మన ప్రేక్షకులకి నచ్చేలా భావోద్వేగాలు ఉన్నాయి. విజువల్స్, క్యారక్టర్ లు నా మైండ్ సెట్ లోనుంచి వెళ్లడం లేదు. సినిమా అంటే ఇదే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. అందరు థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చెయ్యండని చెప్పుకొచ్చాడు.
also read:17 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సిజ్జు.. విడాకులు వస్తాయా!
ఇక పుష్ప 2 తో పాన్ ఇండియా లెవల్లో స్టార్ మేకర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ తన అప్ కమింగ్ మూవీని మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం కాబోయే ఈ మూవీని పుష్ప 2 ని మించి సక్సెస్ చెయ్యాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నాడు.