English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. నాగార్జున దర్శకుడు మృతి.. కారణమిదే!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కిరణ్‌ కుమార్‌(కేకే) కన్నుమూశారు. మరణానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చి, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. (Director Kiran Kumar)

Also Read: చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్!

మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కేకే.. 2010లో నాగార్జున హీరోగా వచ్చిన 'కేడి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. దర్శకుడిగా బ్రేక్ తీసుకున్న ఆయన.. చాలా గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ కి రెడీ అయ్యారు. ఇటీవల KJQ(కింగ్‌.. జాకీ.. క్వీన్‌) అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న వేళ.. డైరెక్టర్ కేకే మరణించడం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.