English | Telugu
17 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సిజ్జు.. విడాకులు వస్తాయా!
Updated : Dec 18, 2025
-సిజ్జు విడాకులు ఎందుకు ఇచ్చాడు!
-సిజ్జు భార్య ఎవరు
-విడాకులకి కారణం ఏంటి!
దేవిశ్రీప్రసాద్ మొట్టమొదటి మూవీ 'దేవి' సినిమాని, అందులోని సాంగ్స్ ని మర్చిపోవడం ఇప్పట్లో ఎవరి తరం కాదు. లెజండ్రీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1999 లో వచ్చిన ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయమై మంచి పేరు సంపాదించాడు సిజ్జు. మలయాళ చిత్ర సీమకి చెందిన సిజ్జు ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసి మంచి పేరు సంపాదించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నువ్వు నాకు నచ్చావు, సింహరాశి. మనసంతా నువ్వే. శివరామరాజు, శతమానం భవతి,బ్లఫ్ మాస్టర్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సిజ్జు రీసెంట్ గా పోస్ట్ చేసిన నోట్ ఒకటి అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.
సదరు నోట్ లో 'నా భార్య ప్రీతీ ప్రేమ్ నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. అధికారకంగా విడాకులు కూడా మంజూరు అయ్యాయి.ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మా ఇద్దరిపై పుకార్లు సృష్టిస్తు మా ఇద్దరి వ్యక్తిగత గోప్యానికి ఎలాంటి భంగం కలిగించవద్దు. ఈ విషయంలో ప్రతి ఒక్కర్ని అభ్యర్దిస్తున్నాను. ఇకపై మేము విడివిడిగా జీవితాన్ని కొనసాగిస్తామని ఇనిస్టాగ్రమ్ లో నోట్ ని రిలీజ్ చేసాడు.
Also read: ఛావా క్లైమాక్స్ సీన్ పై విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడే ఎందుకని
సిజ్జు, ప్రీతీ ప్రేమ్ ది లవ్ మ్యారేజ్. మతాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. 2008 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ఒక కూతురు కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు పదిహేడేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ విడిపోవడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చినీయాంశమయ్యింది. సిజ్జు పూర్తి పేరు సిజు అబ్దుల్ రషీద్. ఎయిర్ హోస్ట్ గా పని చేసిన ప్రీతీ ఒక క్రిస్టియన్.