English | Telugu
నవ్వుతున్నారనే విషయం తెలియడం లేదా.. వీడియో వైరల్
Updated : Dec 18, 2025
-వీడియోలో ఏముంది
-అభిమానులు ఏమంటున్నారు
-జనవరి 12 న ఏం జరగబోతుంది
మరో ఇరవై ఐదురోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)నుంచి వచ్చే నవ్వుల జడివాన 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో అభిమానులు, ప్రేక్షకులు తడిసి ముద్దవనున్నారు. విక్టరీ వెంకటేష్(vekatesh)కూడా తోడవ్వడంతో ఆ నవ్వుల జడివాన ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అనే విధంగా అనిల్ రావిపూడితో సహా చిత్ర యూనిట్ మొత్తం ఎప్పటికప్పుడు హామీ ఇస్తూ వస్తుంది. అందులో భాగంగానే మేకర్స్ కొద్దిసేపటి క్రితం మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. మరి ఆ వీడియోలో ఏముందో చూద్దాం.
సదరు వీడియోని చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు షూట్ చేయగా, చిరంజీవి, నయనతార కి దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)సన్నివేశాన్ని చెప్తుంటేనే ఇద్దరు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ప్రత్యేకించి తోటి ఆర్టిస్టులతో చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్ తో చెప్పిన డైలాగ్స్ చూస్తుంటే రేపు థియేటర్ బాక్స్ లు నవ్వుల సౌండ్ కి బద్దలవ్వడం ఖాయంగా అనిపిస్తుంది. సదరు వీడియోతో మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అవ్వగా,రిలీజైన కాసేపట్లోనే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
Also Read:మనమంతా మానవ మాత్రులం.. అవతార్ 3 పై సుకుమార్ కీలక వ్యాఖ్యలు
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుండటంతో రోజుకొక అప్ డేట్ తో మన శంకర వర ప్రసాద్ గారు ప్రేక్షకులకి పలకరించనున్నాడు. ఇప్పటకే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మిగతా సాంగ్స్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుండంతో పాటు అనిల్ రావిపూడి స్టైల్లో ట్రైలర్ అతి త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శంకర వర ప్రసాద్ వైఫ్ శశిరేఖగా నయనతార కనిపిస్తుండగా కేథరిన్ సెకండ్ హీరోయిన్ రేంజ్ లో ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులు కనిపిస్తుండగా సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్(Bheems) మ్యూజిక్.