కుంభమేళ మోనాలిసా తెలుగు మూవీ స్టార్ట్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందా!
కుంభమేళ'(Kumbh Mela)అనగానే ఎన్నో విశేషాలు గుర్తుకు వస్తుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని 'మోనాలిసా'(Monalisa)కూడా ఒక విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూపీ కి చెందిన మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకుంటూ ఉంటే, కొంత మంది ఆమెలో ఉన్న ప్రత్యేక అందానికి ముగ్దులయ్యారు. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రత్యేకమైన నయనాలతో, నవ్వుతో, చూపులతో ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా మారింది.