English | Telugu
Karthika Deepam2 : పుట్టినరోజున భార్యకి మాటిచ్చిన భర్త.. పగతో రగిలిపోతున్న ఆ ముగ్గురు!
Updated : Jun 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -64 లో.. దీప ఇంటికి వచ్చి శౌర్యకి ఆకలిగా ఉన్నట్లుందని అనుకుంటుంది.. రా తిందువు అని దీప పిలుస్తుంది. లేదమ్మా నేను తినేసాను కార్తీక్ నేను బయటకు వెళ్లి పిజ్జా తిన్నామని శౌర్యా అనగానే.. అంటే ఏంటని దీప అడుగుతుంది. నువ్వు నాకు అది చేసి పెట్టాలి అమ్మ.. చాలా బాగుంది నాకు నచ్చిందని శౌర్య అంటుంది. సరే నువ్వు లోపలకి వెళ్ళని శౌర్యని దీప పంపిస్తుంది. పిజ్జా అంటే ఏంటి బాబు.. అది ఎంత ధర ఉంటుందని దీప అడుగుతుంది.
చిన్న పిల్లల ఆకలికి కూడా వెలకడతారా అని కార్తీక్ అనగానే.. అలా అని కాదు.. ఎంత ఉంటుందో చెప్పండి అని దీప అంటుంది. అరువందల యాభై అయింది.. ఇద్దరం తిన్నామని కార్తీక్ చెప్తాడు. రోజు ఆరువందల యాభై ఎక్కడ నుండి తీసుకొని రావాలని దీప అంటుంది.. అది ఎప్పుడో ఒకసారి తినాలి కానీ రోజు తింటారా అని కార్తీక్ అంటాడు. అదే కావాలని మారం చేస్తే అని దీప అడుగుతుంది. అలా చేస్తే చెయ్యకూడదని చెప్పాలని కార్తీక్ అంటాడు. నాకు పిజ్జా తినిపించాడు కదా కార్తీక్ కు థాంక్స్ చెప్పమని శౌర్య అనగానే.. వెళ్తున్న కార్తీక్ ని దీప పిలిచి థాంక్స్ అని చెప్తుంది. దానికి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీప ఫస్ట్ టైమ్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.. త్వరలోనే క్షమించానని కూడా చెప్పాలి అనుకుంటాడు. మీకో విషయం చెప్పాలి. మీరు మీ హోటల్ లో ఉప్మా పిజ్జా ట్రై చేయకండని వెటకారంగా కార్తీక్ అంటాడు. అదంతా చుసిన పారిజాతం కోపంగా.. థాంక్స్, పిజ్జాలు కథ బానే దూరం పోయింది. ఇక ఇలాగే వదిలి వెయ్యకూడదని అనుకుంటుంది.
ఆ తర్వాత నర్సింహ దీప ఇంటికి వచ్చి గొడవ చేసిన విషయం గుర్తుకుచేసుకొని కోపంగా ఉంటాడు. నర్సింహాని ఇంకా రెచ్చగొట్టేలా శోభ, అనసూయ మాట్లాడుతారు. ఆ దీప ఊరు నుండి వెళ్లెవరకు వదిలిపెట్టొద్దని శోభ చెప్తుంది. మరొకవైపు రేపు నా బర్త్ డే కాబట్టి నేను చెప్పింది చేస్తానని మాట ఇవ్వండి అని శివన్నారాయణ అని పారిజాతం అడుగుతుంది. అది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు అనగానే శివన్నారాయణా మాటిస్తాడు. అప్పుడే దశరథ్ కూడా సరే అంటాడు. మరోవైపు అలా ఎవరితో వెళ్ళకూడదని శౌర్యకి దీప చెప్తుంది. మరొకవైపు కాంచన, శ్రీధర్ కలిసి కార్తీక్ కోసం వెయిట్ చేస్తుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. త్వరగా ఇంటికి వచ్చేవాడివి. ఎందుకిలా చేస్తున్నావ్.. నువ్వు చేస్తుంది చూస్తుంటే పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని కాంచన అనగానే.. ఎందుకు అలా మాట్లాడుతున్నావని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.