English | Telugu
కృష్ణ ముకుంద మురారి సీరియల్ కు శుభం కార్డు?
Updated : Jun 8, 2024
స్టార్ మా టీవీ సీరియళ్ళలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కృష్ణ, మురారీల భార్యాభర్తల బాండింగ్ అంటే అందరికి ఇష్టమే. అలాగే కృష్ణ, మురారీలని ముకుంద పెట్టే టార్చర్ చూస్తుంటేనే ఆడియన్స్ కి కోపం వచ్చేస్తుంది. ఎలాగైనా మురారిని దక్కించుకోవాలనే స్వార్థంతో ముకుంద చేయకూడనివన్నీ చేసేస్తుంటుంది.
మురారిని దక్కించుకోవడం కోసం ఏకంగా తన ముఖాన్నే సర్జరీ చేసుకొని కొత్తగా మీరాగా వచ్చేసింది ముకుంద. ఇక కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసి రగిలిపోయి తన కడుపు పోయేలా విషమిచ్చింది మీరా అలియాస్ ముకుంద. ఇక కృష్ణ, మురారీలకి సరోగసీ ప్లాన్ గురించి వివరించి వారిచేత ఆ ప్రాసెస్ కి డాక్టర్ వైదేహి చేత చెప్పిస్తుంది మీరా. ఇక మీరా ప్రెగ్నెంట్ అని అందరికి తెలియడం కోసం తను కావాలనే కళ్ళు తిరిగినట్టు నటించేసింది. అదే విషయం అందరికి తెలిసి మీరాని నిలదీస్తారు. మురారీ వల్ల తను తల్లి అయిందని ఇంట్లో అందరిని నమ్మించే ప్రయత్నం చేయగా.. ఎవరు నమ్మకపోగా తన గురించే ఎంక్వైరీ చేస్తారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మురారిని వెతుక్కుంటూ మధు, కృష్ణ వెళ్ళగా అక్కడ మీరా దగ్గర గాయాలతో మురారి ఉంటాడు. అది చూసి కృష్ణ , మధు షాక్ అవుతారు.
ఇక మీరాని చెంపచెల్లుమనిపించిన కృష్ణ.. గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మధు, కృష్ణ కలిసి మురారిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇదిలా ఉండగా భవాని డాక్టర్ వైదేహీ దగ్గరకు వెళ్ళి .. మీరా గురించి నిజం తెలుసుకుంటుంది. ఇక కృష్ణ, మధు ఇంటికి రాగా రేవతి మాట్లాడుతుంటుంది. మురారి జాడ తెలిసిందా అని రేవతి అడుగగా.. కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది .
అయితే కృష్ణ ప్రెగ్నెంటా లేక నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందా అనేది నేటి కథనంలో తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని పేజీలలో రేపటితో కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి శుభం కార్డు పడుతోంది అంటు పోస్ట్ లు వస్తున్నాయి. ఇక ఈ సీరియల్ తో పాటు ఊహలు గుసగుసలాడే అనే మరో సీరియల్ కూడా ముగుస్తుందని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సీరియల్ ఎండింగ్ అవుతుందా.. ఒకవేళ శుభం కార్డ్ పడితే ఎలా ముగిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.