English | Telugu

Guppedantha Manasu : రిషి సర్ కన్పించారు.. మనుషుల ఎమోషన్స్ తో ఎందుకు ఆడుకుంటున్నావ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1094 లో..... రిషి గురించి వసుధార బాధపడుతుంది. అందరు రిషి సర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. రిషి సర్ లేరని అంటున్నారని వసుధార ఎమోషనల్ అవుతుంది. ఎవరు నమ్మిన నమ్మపోయిన నేను నమ్ముతున్నా..‌ నీ నమ్మకం నిజం అవ్వాలని మహేంద్ర అనగానే అది జరగదని శైలేంద్ర అంటాడు. రిషి రాడు లేడని శైలేంద్ర అంటాడు. ఇంకొకసారి అలా అనకని వసుధార కోప్పడుతుంది.

ఉరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావని మహేంద్ర కోప్పడతాడు.. రిషి సర్ బ్రతికే ఉన్నాడు.. లేదంటే నా ఊపిరి ఆగిపోయేదని ఎందుకు అంటున్నావ్.. నాకు తెలుసని శైలేంద్ర అనగానే ఎందుకని వసుధార అంటుంది. ఎండీ చైర్ కోసం ఆ సీట్ లో పర్మినెంట్ గా కూర్చోవాలని నీ ఆశ అందుకే అలా కలరింగ్ ఇస్తున్నావని శైలేంద్ర అనగానే.. నేను నీలాగా కాదు. ఎందుకు అలా మాట్లాడి నన్ను ఇబ్బంది పెడుతున్నావంటూ వసుధార అంటుంది.. అప్పుడే మను వస్తాడు. వచ్చావా ఇంకా రాలేదని చూస్తున్నానని శైలేంద్ర వెటకారంగా మాట్లాడుతాడు. నీకు ఒక గోల్ ఉంది ‌. నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని.. అది కాకుండా మా విషయాలను ఎందుకు పట్టించుకుంటావని మనుని శైలేంద్ర అంటాడు. ఇంతవరకు రిషి రాలేదంటే లేడనే అర్ధం కదా వాళ్లకు చెప్పు రిషి రాడని శైలేంద్ర మనుతో అనగానే.. వస్తాడని మను అంటాడు‌. కావాలనే శైలేంద్ర వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు.

మరొకవైపు దేవయాని పేపర్ చదువుతుంటే.. రిషి కన్పించడం లేదని ప్రకటన కన్పిస్తుంది. అది చూసి ఫణీంద్రతో దేవయాని చెప్తుంది. ఈ వసుధార ఇలా చేస్తుందేంటి.. అసలు మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి ఇదంతా చేస్తుందని దేవయాని అనగానే.. నువ్వు ఇక మారవా అంటూ దేవయానిపై ఫణీంద్ర విరుచుకుపడుతాడు. మరొకవైపు ఎవరో వసుధారకు ఫోన్ చేసి.. రిషిని చూసానని అనగానే.. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి కన్పించిన అడ్రెస్ చెప్పగానే.. వసుధార, మను ఇద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్లేసరికి అక్కడ శైలేంద్ర టీ తాగుతూ ఉంటాడు. ఎందుకు మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావని శైలేంద్రపై వసుధార కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.