English | Telugu

Karthika Deepam2 : కోడలిని చూసి అత్త పరుగులు.. ఓరకంటగా దీపని చూస్తూ కార్తీక్ నవ్వులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -65 లో.....కార్తీక్ ఇంటికి వస్తాడు. నా కోసం తినకుండా వెయిట్ చేయకని ఎన్నిసార్లు చెప్పాలని కాంచనతో శ్రీధర్ అంటాడు. నువ్వు చేంజ్ అయ్యావ్.. త్వరగా ఇంటికి వచ్చేవాడివి.. ఇప్పుడు అవుట్ హౌస్ ల చుట్టూ తిరుగుతున్నావని కాంచన అనగానే.. నువ్వేంటి అమ్మలా అంటున్నావ్.. అత్తయ్య అక్కడే ఉంది తను జరుగుతుంది అంతా చూస్తుంది కాబట్టి తనకి తెలియదా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు.

మరుసటిరోజు అనసూయ మార్కెట్ కి వెళ్తుంటే.. దీప కన్పిస్తుంది. నిన్న వాడిపై అంత కోపం చూపించింది. ఇప్పుడు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అంటు.. దీపకి కన్పించకుండా హడావిడిగా వెళ్తుంటే.. కార్తీక్ కి డాష్ ఇస్తుంది. తనని చూసిన కార్తిక్.. ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారని అనసూయని అడుగుతాడు. ఆ దీప వస్తుందని అందుకేనని అనసూయ అనగానే.. వస్తే ఏం అంటుందని కార్తీక్ అంటాడు. ఇక రాత్రి దీప వచ్చి చేసిన గొడవ అంత కార్తీక్ కి చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. ప్రతిదానికి భయపడే దీపలో అంత దైర్యం ఉందా అని అనుకుంటాడు. అనసూయ అక్కడ నుండి వెళ్తు.. ఆ దీప దైర్యం నిన్ను చూసుకునే కదా అని అనసూయ అనుకుంటుంది. అంటే దీప నిన్న శౌర్యని వదిలిపెట్టి వెళ్లింది వీళ్ళ దగ్గరికేనా అని కార్తీక్ అనుకుంటాడు.

ఆ తర్వాత అందరు పారిజాతాజికి బర్త్ డే విషెస్ చెప్తారు. ఈ రోజు మీ బర్త్ డే స్పెషల్ గా దీప తో పాయసం చేయిస్తున్నానని సుమిత్ర అనగానే.. పారిజాతానికి కోపం వస్తుంది. మరొకవైపు అన్నయ్య ఫోన్ చేసాడు. ఈ రోజు పిన్ని బర్త్ డే కదా వెళదామని కాంచన అనగానే.. నాకు వేరే వర్క్ ఉందని శ్రీధర్ అంటాడు. మీకు దీప చేసిన పాయసం ఇష్టం కదా అని కాంచన అనగానే.. దీప ఉందంటే అసలు రానని శ్రీధర్ అనుకొని వర్క్ ఉందంటూ వెళ్ళిపోతాడు. మరొక వైపు కార్తీక్ వచ్చి పారిజాతానికి విషెస్ చెప్తాడు. ఏంటి స్పెషల్ అని కార్తీక్ అనగానే.. నీకు ఇష్టమైన పాయసం దీప చేస్తుందని జ్యోత్స్న వెటకారంగా అంటుంది. మరొకవైపు దీప పాయసం రెడీ చేస్తుంటుంది. కార్తీక్ ఫోన్ చూస్తూ కిటికీ లో నుండి దీప వంక చూస్తూ.. నిన్ను చాల పొగడాలని ఉందని అనుకుంటాడు.. ఆ తర్వాత దీప కార్తీక్ దగ్గరికి వచ్చి.. ఏంటో చూసి నవ్వుతున్నారని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.