English | Telugu
Karthika Deepam2 : దీపకి నరసింహా వార్నింగ్.. ఆ విషయం కార్తిక్ కి తెలిసిపోయిందా!
Updated : Jun 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -70 లో....నర్సింహ మళ్ళీ దీపతో గొడవ పెట్టుకుంటాడు. నువ్వు ఒక ఆడదానివి అని నిన్నేం చేయకుండా వదిలేసానని నర్సింహా అనగానే.. నేనే నిన్ను వదిలేసాను నా కూతురు కోసం.. ఎందుకంటే తల్లి కూడా దూరం కాకూడదని దీప అంటుంది. నువు వచ్చి నా భార్యకి సారీ చెప్పి.. ఈ ఊరు నుండి వెళ్ళిపోమని దీపకి నరసింహా వార్నింగ్ ఇస్తాడు. తప్పు చేసింది నువ్వైతే ఏ తప్పు చేయని నేనెందుకు వెళ్ళాలని దీప పొగరుగా సమాధానం చెప్పేసరికి నర్సింహాకి ఇంకా కోపం వస్తుంది.
మరొకవైపు శ్రీధర్ కూతురు స్వప్నని కార్తీక్ హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. అక్కడ కార్తీక్ ని స్వప్న చిరాకు పెడుతుంది. మాస్టారు అంటు కార్తీక్ ని స్వప్న పిలుస్తుంటే.. మా నాన్నని కూడా ఇలాగే పిలుస్తానని కార్తీక్ అంటాడు. అప్పుడే స్వప్న వాళ్ళ అమ్మ కావేరి హాస్పిటల్ కి వచ్చి.. నా కూతురికి ఏమైందని టెన్షన్ పడుతుంది. స్వప్నని హాస్పిటల్ కి తీసుకొని వచ్చినందుకు కార్తీక్ కి కావేరి థాంక్స్ చెప్తుంది. అప్పుడే దీప టిఫిన్ ఆర్డర్ పెట్టారని రిసెప్షన్ దగ్గరకి వస్తుంది. దాంతో వాళ్ళు స్వప్న అనే అమ్మాయికి ఇవ్వండి అని పంపిస్తారు. దీప స్వప్న ఉన్న రూమ్ కి వస్తుంది. అక్కడే కావేరి, కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది. ఏంటి కార్తీక్ బాబు కి కావేరి తన పిన్ని అన్న విషయం తెలుసా అని అనుకుంటుంది. దీపని కార్తిక్ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. టిఫిన్ ఆర్డర్ పెట్టారు ఇవ్వడానికి వచ్చానని దీప అనగానే.. నేనే ఆర్డర్ పెట్టానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కావేరి కి దీపకి ఇది వరకే గొడవ అయిందన్న విషయం కార్తీక్ కి కావేరి చెప్తుంది. ఇంకా డాడ్ రాలేదా అని స్వప్న అడుగుతుంది. అప్పుడే శ్రీధర్ డోర్ వరకు వచ్చి అక్కడ అందరిని చూసి వెనక్కి వెళ్తాడు. ఏంటి దీప ఇక్కడే ఉంది. నిజం చెప్పేసిందా అని శ్రీధర్ బయపడి వెళ్తుంటాడు. ఆ తర్వాత దీప , కార్తీక్ లు వస్తుంటే మీకు వాళ్ళు తెలుసా అని దీప అడుగుతుంది. లేదు స్వప్న కి ఏదో ఆక్సిడెంట్ చేసింది. ఎవరికీ ఏం కాలేదు కానీ తనకే కాలుకి తాకిందని కార్తీక్ చెప్పగానే.. అయితే కార్తీక్ బాబు కి నిజం తెలియదన్న మాట అని దీప అనుకుంటుంది.
మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లి ఆఫీస్ లో వర్క్ ఉండడం వళ్ళ లేట్ అయిందని కాంచనకి చెప్తాడు. కార్తీక్ ఎవరో స్వప్న అమ్మాయికి దెబ్బ తాకితే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడట.. ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుతుందట.. నాకు గాని చెల్లి ఉంటే ఇలాగే ఉండాలని కార్తీక్ అన్నాడని కాంచన చెప్పగానే.. చెల్లి ఉంటే ఏంటి.. తను చెల్లినే అని శ్రీధర్ మనసులో అనుకుంటాడు. ఆ అమ్మాయిని ఒకసారి లంచ్ కి పిలుస్తానని కాంచన అనగానే.. వద్దని శ్రీధర్ ఏదో ఒకటి కవర్ చేస్తాడు. మరొకవైపు శౌర్యకి దీప పాటలు నేర్పిస్తుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.