English | Telugu

కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్

స్టార్ మాలో త్వరలో ఎక్సయిటింగ్ గేమ్ షో ఒకటి రాబోతోంది. కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్. ఈ షో ప్రోమో చూస్తేనే వారెవ్వా అని అనిపించేలా ఉంది. ఈ షోకి సంబంధించిన ఒక టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర మీద రెగ్యులర్ గా ఎంటర్టైన్ చేసే వాళ్ళే ఉన్నారు. అమరదీప్ చౌదరి, యాదమ్మ రాజు, ప్రియాంక జైన్, జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య, బ్రహ్మముడి హీరోయిన్ దీపికా రంగరాజు, నిఖిల్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, శోభా శెట్టి, ప్రేరణ కంభం, శేఖర్ మాస్టర్, అనసూయ వంటి వాళ్ళు చాలామంది ఈ షోలో కనిపించనున్నారు.

అమరదీప్ స్టార్టింగ్ లో "హలో స్టార్ మా..అర్జెంటుగా ఒక స్క్రోలింగ్ వేయాలి. బాయ్స్ అంటే బెస్టు , గర్ల్స్ అంటే డస్టు" అని టైటిల్ కి యాప్ట్ గా ఉండేలా ఒక కంటెంట్ చెప్పాడు. ఇక ఫైనల్ లో "కిర్రాక్ బాయ్స్ అబ్బాయిలంటే మాసు" అని శేఖర్ మాష్టర్ చెప్తే "ఈ మ్యాడ్ నెస్ కదా మనకు కావాలి, ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా " అని అనసూయ చెప్పింది. "ఎంజాయ్ చేయడానికి ఇది బ్లాక్ బస్టర్..నవ్వడానికి ఇది స్ట్రెస్ బస్టర్ " అని శేఖర్ మాష్టర్ సరికొత్త తరహాలో చెప్పారు. "గర్ల్స్ బెస్టా, బాయ్స్ బెస్టా" అని అనసూయ అడిగితే " ఈ పెద్ద క్వశ్చన్ కి ఒక పెద్ద ఆన్సర్ రాస్తా" అని శేఖర్ మాష్టర్ ముగించారు. సరికొత్త మాస్ మసాలా రియాలిటీ షో అంటూ ఈ ప్రోమో ఎండ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ అంతా "తేజు ఉంటే బాగుంది, కావ్య ఉండాలి, శ్రీముఖి హోస్ట్ గా ఉండాలి" అని మెసేజెస్ పెడుతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.