English | Telugu
రాజీవ్ ని ఏ ఫ్రూట్ తో పోల్చాలో ....
Updated : Jun 15, 2024
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఈ వారం ఎలాంటి మూవీ ఓపెనింగ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ ఐతే రాలేదు..సీరియల్స్ అండ్ మూవీస్ లో నటించిన సీనియర్ నటీమణులు వచ్చి అలరించారు. వాళ్ళే రాగిణి, శివ పార్వతి, శ్రీప్రియ, హరిత.. వీళ్ళ నలుగురు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అటు మూవీస్ లో ఇటు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఈ షోలో సుమతో కలిసి సందడి చేశారు. రాగానే సుమ వెరైటీగా ఒక ప్రశ్న వేసింది "శివపార్వతి గారు మిమ్మల్ని మీరు ఏ ఫ్రూట్ తో కంపేర్ చేసుకుంటారు" అని అడిగింది. దానికి ఆమె "ఉల్లిపాయ" అని ఆన్సర్ ఇచ్చేసరికి అందరూ నవ్వేశారు. ఇక అదే ప్రశ్నని హరితని కూడా అడిగింది సుమ "జాక్ ఫ్రూట్" అని చెప్పింది.
జాక్ ఫ్రూట్ లో భర్త జాకీ పేరు ఉంది కదా అందుకే ఆ ఫ్రూట్ ఇష్టం అని చెప్పింది. హరిత ఆన్సర్ కి సుమ డిఫెన్సె లో పడింది.. "ఇప్పుడు నేను రాజీవ్ పేరుతో ఏ ఫ్రూట్ వెతకాలా అని ఆలోచిస్తున్నా" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత శివపార్వతి తనను ఒక అభిమాని వేసిన ప్రశ్న గురించి చెప్పింది. "అప్పటికి ఇప్పటికీ మీరు ఒకేలా ఉన్నారు ఎలా..మీ సీక్రెట్ ఏమిటి " అని అడిగారట.. దానికి ఆమె "అప్పుడు, ఇప్పుడు అదే మేకప్" అని చెప్పడంతో ఆ అభిమాని నవ్వేసాడట. ఇక ఇప్పటి సీరియల్స్ లో సాగుతున్న ఎపిసోడ్స్ మీద ఒక సెటైరికల్ స్కిట్ వేయించింది "అత్త యాక్షన్- కోడలు ఓవర్ యాక్షన్...10 వేల ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్" పేరుతో వేసిన ఈ స్కిట్ అందరినీ నవ్వించింది. తర్వాత శివపార్వతి అలనాటి ఆ పాత మధుర గీతం "రివ్వున సాగే రెపరెపలాడే" పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అలరించింది. ఇలా ఈ సీనియర్ నటీమణులతో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది .