English | Telugu

Karthika Deepam2 : నా మనసు దీపకి అర్థమైంది.. శౌర్యకి పేరెంట్స్ మీటింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -71 లో.. దీప శౌర్యకి పాటలు నేర్పిస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి రౌడీ నన్ను చూసి పాట ఆపేసావని కార్తీక్ అంటాడు. నీ ముందు పాడితే నవ్వుతావ్ కదా.. అందుకే ఆపేసానని శౌర్య అంటుంది. రేపు స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉందని దీపకి కార్తీక్ చెప్తాడు. అంటే ఏంటని దీప అడుగుతుంది. పిల్లలపై శ్రద్ధ పెట్టాలంటూ కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఎలా చదవాలని చెప్తారు నా ఫోన్ కి మెసేజ్ వచ్చిందని కార్తీక్ అంటాడు. రేపు వెళ్ళాక స్కూల్ లో మీ అమ్మ నెంబర్ ఇవ్వు ఇక నుండి మీకే మెసేజ్ వస్తుందని అనగానే మా అమ్మకి చదవడం రాదని శౌర్య అంటుంది. రేపు వెళ్ళండి అని కార్తీక్ అంటాడు.

మా అమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కాదు.. నువ్వు కూడా రావాలని శౌర్య అంటుంది. ఇప్పుడు కార్తీక్ వస్తే నర్సింహా అన్న మాట నిజం అవుతుందని దీప, కార్తీక్ లు అనుకుంటారు.. రేపు మనం ఇద్దరం వెళ్తున్నామని శౌర్యకి దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ వెళ్తుంటే.. మీతో మాట్లాడాలని దీప ఆగమని చెప్తుంది. శౌర్యని లోపలికి పంపించి.... స్వప్నకి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. మీకెలా గుర్తుకు ఉందని కార్తీక్ అంటాడు. నాకు తనకి ఏదో బంధం ఉందని అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. రెండవది జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని దీప అడగ్గానే కార్తీక్ షాక్ అవుతాడు. మీరు కాబోయే భార్యాభర్తలని అనుకుంటున్నారు. మీరు తన చేతిలో చెయ్యి వేయడానికి ఇష్టపడలేదనిపించిందని దీప అనగానే.. నా మనసు దీపకి అర్థం అయిందని కార్తీక్ అనుకుంటాడు. మీరు శౌర్యకి ఫోన్ ఇచ్చారు. మీరు మాట్లాడడం జ్యోత్స్న విన్నది. ఇక మీరు అర్ధం చేసుకుంటారనుకుంటున్నానని దీప అంటుంది. మీ మాటల్లో అర్థమవుతుంది మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని కార్తీక్ అనుకుంటాడు.

ఆ తర్వాత శ్రీధర్ పూజ చేసి హారతి కాంచనకి ఇస్తాడు. మీరు దొరకడం అమ్మ అదృష్టం డాడ్ అని కార్తీక్ అంటాడు. ఆ అమ్మయికి ఎలా ఉంది ఒకసారి వీడియో కాల్ చెయ్ అని కాంచన అనగానే.. ఎందుకని శ్రీధర్ కంగారు పడతాడు. ఆ తర్వాత జ్యోత్స్న ని బ్రేక్ ఫాస్ట్ కి తీసుకొని వెళ్తున్నానని కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీప శౌర్యని తీసుకొని స్కూల్ రెడీ అవుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఈ రోజు స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ అని శౌర్య చెప్పగానే పేరెంట్స్ మీటింగ్ అంటే కచ్చితంగా ఇద్దరు ఉండాలి. మీ నాన్న ఎక్కడ అని శౌర్యతో జ్యోత్స్న అనగానే ఎందుకు ఇలా కావాలనే జ్యోత్స్న చేస్తుందని దీప అనుకొని అది నేను చూసుకుంటానని దీప పొగరుగా సమాధానం చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న కి కార్తీక్ ఫోన్ చేసి.. బ్రేకఫాస్ట్ కి వెళదామని అనగానే జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.