సైలెంట్‌గా రష్మీ.. ఆది సెటైర్లు... అసలు ఏమయ్యింది!
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేసేదిగా కనిపిస్తోంది. ఐతే ఈ షో ఆది, నాటీ నరేష్ కలిసి దొంగలుగా నటించారు. ఇక నాగదేవత జాతర జరిపించి ఆ ఊరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఈ జాతరను నిర్వహించడానికి రష్మీని, ఇంద్రజాను పిలిపించారు. వాళ్ళు ఎంటర్టైన్ చేయిస్తూ ఉన్నారు. ఈ షోలో కొంతమంది తెలంగాణ జానపద పాటలు పాడి అలరించారు. అలాగే బులెట్ భాస్కర్, రాకెట్ రాఘవకు మధ్య ఒక గేమ్ నిర్వహించారు.