English | Telugu
Karthika Deepam2 : నాన్న కావాలని ఎమోషనల్ అయిన శౌర్య.. కూతురిని పట్టుకొని ఏడ్చేసిన దీప!
Updated : Jun 21, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -76 లో....కార్తీక్ దీప దగ్గరికి వచ్చి.. నిన్ను నర్సింహా మళ్ళీ ఏమైనా అన్నాడా.. నువ్వు వాడి మీద కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతాడు. వాడు నన్ను ఏమైనా అంటే మీకేంటి ? నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు. నేనేం అంటున్నా మీరేం అంటున్నారని కార్తీక్ సీరియస్ అవుతాడు. వాడు శౌర్యని అడ్డుపెట్టుకొని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు. అది అర్థం కాదా మీరేం చెయ్యరు నన్నేం చెయ్యనివ్వరని కార్తీక్ అంటాడు. మీరు జ్యోత్స్నతో మాట్లాడలేదని దీప అనగానే.. జ్యోత్స్న మిమ్మల్ని ఏమైనా అందా అని కార్తీక్ అడుగుతాడు. మీరు అనేలా ఎందుకు చేస్తున్నారని దీప అంటుంది. ఇది నా జీవితం నన్ను బ్రతనివ్వండని దీప చేప్పి వెళ్ళిపోతుంది.
మరొకవైపు దీపతో మాట్లాడింది మొత్తం జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. నేను ఉండాలిసింది నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దీప మొహం ఎలా అయిందోనని పారిజాతం అంటూంది. మనకి తెలియనిది వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఆ స్ట్రాంగ్ ఎమోషన్ వాళ్ళ ఇద్దరినీ దగ్గరికి చేస్తోంది. ఇప్పుడు గార్డియన్ గా నువ్వున్నావ్ కాబట్టి కార్తీక్ అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. నువ్వు అన్నమాటలకి దీప హోటల్ దగ్గరికి రానియ్యదు. వాళ్ళు మనం ఉండగా ఇంటి దగ్గర కూడా కలవరని పారిజాతం అంటుంది. ఇవన్నీ కాకుండా మరొక మీటింగ్ ప్లేస్ పెట్టుకుంటే అని జ్యోత్స్న అంటుంది. అలా జరగకుండా చేసే ఆలోచన నాదగ్గర ఉందని పారిజాతం అంటుంది.
మరొకవైపు దీప దగ్గరికి శౌర్య వచ్చి.. ఈ రోజు ఒక తప్పు చేసానని అంటుంది. ఏంటని దీప అడుగుతుంది. రెండు రోజుల్లో ఫాథర్స్ డే ఉందట.. అంటే ఏంటని మా ఫ్రెండ్ ని అడిగాను. నీకు ఫాదర్ లేడు కదా మొన్న పేరెంట్స్ మీటింగ్ కి రాలేదు అంది. నేను వెంటనే మిస్ దగ్గర ఫోన్ తీసుకొని కార్తీక్ కి ఫోన్ చేసాను. తను వచ్చి ఫాదర్ అంటే ఏంటో చెప్పాడని శౌర్య ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ చెప్తుంటే నాకు నాన్న కావాలనిపించిందని శౌర్య అంటుంది. నీకు రేపు ఒక సర్ ప్రైజ్ అని శౌర్యకి చెప్తుంది దీప. నాన్నని తీసుకొని వస్తానని మాట ఇవ్వని శౌర్య అంటుంది. దాంతో ఏం చెయ్యలేక శౌర్యని పట్టుకొని ఏడుస్తుంది దీప. మరొకవైపు శోభ పిల్లలు పుట్టారని ఏడుస్తుంటే.. ఎందుకు ఏడవడం.. నీకు పుట్టిన ఆ శౌర్య ఉందిగా తెచ్చుకొని పెంచుకోండని అనసూయ అనగానే నర్సింహ సరే అంటాడు. మరొకవైపు శ్రీధర్ ని తన కూతురు స్వప్న చూసి తన దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.