English | Telugu

Karthika Deepam2 : శౌర్య నాకు పుట్టిన బిడ్డ అయితే నాకు ఇచ్చెయ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -77 లో......శ్రీధర్ కాంచనతో బయటకు వస్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న తన రెండవ భార్య కూతురు స్వప్న శ్రీధర్ ని చూసి.. డాడ్ ఏంటి ఇక్కడున్నాడు. ఆఫీస్ వర్క్ అన్నాడు కదా అని అనుకుంటుంది. అప్పుడే కాంచన కారులో లోపల కొబ్బరి బొండం తాగుతుంది. లోపల ఎవరో ఉన్నారని స్వప్న అనుకుంటుంది. కానీ మొహం కన్పించదు. ఎవరావిడ అని అడగాలని స్వప్న వెళ్తుంటుంది. ఆ లోపే శ్రీధర్, కాంచన ఇద్దరు వెళ్ళిపోతారు.

మరొకవైపు దీప హోటల్ లో వర్క్ చేసుకుంటుంది. అప్పుడే హోటల్ ముందుకి కార్తీక్ వస్తాడు. కడియం చూసి కార్తీక్ బాబు మీ కోసం వచ్చాడని దీపకి చెప్తాడు. కార్తీక్ హోటల్ ముందు వెయిట్ చేస్తుంటాడు. దీప చూసి ఎందుకు వచ్చాడని అనుకుంటుంది. కడియం వచ్చి అయన మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడేమో.. నువ్వు బిజీగా ఉన్నావని అక్కడే ఆగిపోయాడు. వెళ్లి మాట్లాడమని దీపని పంపిస్తాడు కడియం. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దీప వచ్చి.. ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని అడుగుతుంది. అప్పుడే స్వప్న వస్తుంది. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానో అర్థమైందా అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఎందుకు రమ్మన్నావ్ అని స్వప్నని కార్తీక్ అడుగుతాడు. మా డాడ్ మా మమ్మీని మోసం చేస్తున్నాడు. నేను లైవ్ లో చూసాను. ఒకావిడతో మా డాడ్ ఉండడం చూసాను. ఇలా చేస్తారనుకులేదని స్వప్న అంటుంది. మొత్తానికి మీ కూతురు కంట్లో పడ్డారు శ్రీధర్ గారు అని దీప అనుకుంటుంది. ఆవిడని చూసావా అని కార్తీక్ అడుగగా.. లేదని స్వప్న అంటుంది. ఇప్పుడు అసలు రోజులు బాలేవు దీపకి కూడ అలాగే అన్యాయం జరిగింది. నువ్వు వెళ్లి మీ డాడ్ ని అడుగమని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప వద్దని చెప్తుంది. మీరు నన్ను కార్ లో తీసుకొని వెళ్తుంటారు. చూసేవాళ్ళు అలాగే అనుకుంటారా.. అలా తెలియకుండా అడగొద్దు కదా అని దీప అంటుంది. అవును అనవసరం గా క్లారిటీ లేకుండా మమ్మీకి చెప్తే తను డిస్టబ్ అవుతుందని స్వప్న అంటుంది. నాకు ఇక్కడికి రావడం వాళ్ళ కొంచెం రిలీఫ్ అయిందని స్వప్న అంటుంది. మొన్న మీరు చేసిన ఉప్మా బాగుంది ఇక నుండి మిమ్మల్ని స్పెషల్ దీప అని పిలుస్తానని స్వప్న అంటుంది. ఆ తర్వాత స్వప్న వెళ్ళిపోతుంది. ఎందుకు వాళ్ళ డాడ్ ని అడగొద్దు అన్నావ్ ? ఆడదానికి అన్యాయం జరగొద్దు.. ఎందుకంటే నీ జీవితాన్ని దగ్గర నుండి చూస్తున్నానని కార్తీక్ అంటాడు.

కాసేపటికి కార్తీక్ వెళ్ళిపోతాడు. అన్యాయం జరిగేది మీ అమ్మకే బాబు అని దీప అనుకుటుంది. ఆ తర్వాత దీప స్కూల్ కి వెళ్తుంది. శౌర్య తండ్రి ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నాడని అటెండర్ చెప్పగానే.. నర్సింహా ఎందుకు వచ్చాడని దీప కంగారుగా వెళ్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు.. నర్సింహా అబద్ధం చెప్పిస్తాడు. నీతో మాట్లాడాలి దీప అని పక్కకి రమ్మని చెప్తాడు. శోభ ప్రెగ్నెంట్ కాదు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదట.. అందుకని నా బిడ్డ శౌర్యని నాకు ఇచ్చేయ్ అని నర్సింహా అంటాడు. నువ్వు అడగ్గానే ఇస్తానని ఎలా అనుకున్నావని దీప అంటుంది. అందుకే శౌర్య నాకు పుట్టిన బిడ్డ అయితే నాకు ఇచ్చేయ్ లేదంటే నువ్వే ఉంచేసుకో నీ జోలికి రానని నర్సింహా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.