English | Telugu

ఆ లిప్స్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది.. శ్రీ సత్య ఫాన్స్ హర్ట్

బిగ్ బాస్ శ్రీ సత్య అంటే  సోషల్ మీడియాలో ఒక క్రేజ్ ఉంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ ఆంధ్రాగా గెలిచి ఎన్నో అవకాశాలు సొంతం చేసుకుంది. ఎన్నో యాడ్స్ లో కూడా నటించింది.  'నేను శైలజ' మూవీలో రామ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించింది. ఐతే శ్రీసత్య సహజంగానే అందంగా ఉంటుంది. ఐతే ఇప్పుడు ఆమె ఫాన్స్ అంతా ఆమెను తిడుతున్నారు. ఎందుకంటే ఆమె ఐబ్రోస్ కి, లిప్స్ కి సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సర్జరీ చేయించుకున్న తర్వాత  ఇప్పుడు అసలు బాలేదని అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ పెడుతున్నారు.

అనసూయ ఆంటీని కన్నెపిల్లను చేశారు

కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్  ప్రోమోలో అనసూయ చాలా హాట్ గా ఉంది.   ఈ షో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతోంది.  నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ‘కాలేజ్ థీమ్’తో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పోటీ పడ్డారు. కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళు చేసిన పెర్ఫామెన్స్‌లు మామూలుగా లేవు. ‘‘కనులు తెరిచిన కన్నెపిల్ల.. కవిత రాసిన కన్నెపిల్ల..  కాలేజీ స్టైలే’’ అంటూ అనసూయ ఆంటీని కన్నెపిల్లను చేసి మరీ చూపించారు. ఇక హాట్ రెడ్ మిర్చి సరీలో చేతిలో పుస్తకాలు  పట్టుకుని కిక్కెక్కించేదిలా ఉంది అనసూయ. ఇక బిగ్ బాస్ గ్యాంగ్ , సీరియల్ యాక్టర్స్ గ్యాంగ్ అనసూయను చూసి ఆమె చీర కొంగు తిప్పిన స్టైల్ చూసి  నెత్తిన చేతులు పెట్టున్నారు బాయ్స్. "నాకు కాలేజ్‌లో స్టూడెంట్స్ అన్నారు.. పేరెంట్స్ కూడా ఉన్నారా ?" అంటూ అంబటి అర్జున్‌పై పంచ్ వేసింది హోస్ట్  శ్రీముఖి. ఇక ఈ షోలో అంతా సీనియర్స్ ముదిరిపోయి పెళ్ళిళ్ళై, పిల్లలున్న బ్యాచ్. ఎవరూ యంగ్ గ్యాంగ్ ఐతే లేదు.  

Karthika Deepam2 : నా బావతో పెళ్లి ఆ దీపకి ఇష్టం లేదు..కళ్ళు తిరిగి పడిపోయిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -87 లో....ఆ దీపకి బావతో నా పెళ్లి జరగడం ఇష్టం లేదని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. ఈ రోజు రెస్టారెంట్ లో దీప ప్రవర్తన ఎందుకో కొంచెం తేడాగా ఉంది. అందరం వెళ్ళాం.. మావయ్య ఇప్పుడే వస్తానంటూ వెళ్ళాడు అప్పుడే బావ ఫ్రెండ్ స్వప్న ఇంకా వాళ్ళ మదర్ వచ్చారు. కాసేపటికి దీప మావయ్య దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడి వచ్చింది. స్వప్న వాళ్ళు వెళ్తానంటే వెళ్ళమని దీప అంది. ఆ తర్వాత మావయ్య వచ్చాడు. నాకు ఏం అర్ధం కాలేదు.. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. నేను బావని పెళ్లి చేసుకోవడం మాత్రం దీపకి ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది.

Eto Vellipoyindhi Manasu : భార్య దొంగతనం చేయలేదని నిరూపించకోగలదా.. భర్త మౌనంపై సందేహం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -139 లో.. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే దీన్ని వాళ్లు అవకాశంగా వాడుకుంటారు.. వెళ్లిపో నాన్న అని రామాలక్ష్మి, ధన కలిసి మాణిక్యానికి చెప్తారు. దాంతో మాణిక్యం వెళ్ళిపోతాడు. ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడతావని రామలక్ష్మితో ధన అంటాడు. మరొకవైపు సీతాకాంత్ జరిగిన దానిని గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే సిరి, పెద్దాయన.. సీతాకాంత్ దగ్గరికి వస్తారు. ఏంటి సీతా నగలు పోవడమేంటి? ఆ నింద రామలక్ష్మి పైన పడడమేంటి? అందరూ రామలక్ష్మిని దొంగ అంటుంటే మాత్రం భరించలేని బాధగా ఉందని పెద్దాయన అంటాడు.

Guppedantha Manasu : ఆమె కోసం కొత్త డ్రెస్.. కుళ్ళుకున్న మరదలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1117 లో....రంగా బట్టలు సర్దుతుంటే వసుధార వచ్చి.. అవి మీ బట్టలా అని అడుగగా.. అవునని రంగా అంటాడు. ఎందుకు సర్ ఇలా చేస్తున్నారు.. అసలు ఎవరి గురించి ఇలా అయ్యారు.. మీరు ఎలా ఉండే వారని వసుధార అంటుంది. ఎలా ఉండేవాన్ని అని రంగా అనగానే.. వసు రిషి స్టైల్ ని ఉహించుకొని మిమ్మల్ని చుస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించేదని వసుధార రిషి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. మీరు నా రిషి సర్ కాదంటున్నారు.. బట్టలు తీసుకొని రమ్మని చెప్పగానే కలర్, మెజర్ మెంట్స్ ఏం అడగకుండా వెళ్లారని వసుధార అంటుంది.

సుధీర్ కి స్రవంతికి మధ్య అన్ని ఐపొయట..మరి రష్మీ

ఫ్యామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఉండగా ఆయన్ని, అలాగే వచ్చే టీమ్ మెంబర్స్ ని అలరించడానికి అన్నట్టు స్రవంతి చొక్కారావు, భానుశ్రీ ఇద్దరు సుధీర్ కి మరదళ్ళుగా ఉంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ రాబోయే వారం ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మరదళ్ళు కలిసి సుధీర్ ని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతూ ఉన్నారు. ఈ షోకి "భలే ఉన్నాడే" మూవీ ప్రొమోషన్స్ కోసం  స్పెషల్ గెస్ట్ గా హీరో రాజ్ తరుణ్ వచ్చాడు. "నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను వదిలేసేలా ఉన్నావ్ గాని నేను నా ఫామిలీని పిలిపించి తాంబూలాలు ఇప్పించేస్తా ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం" అని సీరియస్ గా చెప్పింది భానుశ్రీ.

Karthika Deepam2 : నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు.. బావతో పెళ్ళి జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -86  లో... జ్యోత్స్నతో పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి కార్తీక్ అందరిని రెస్టారెంట్ కి పిలుస్తాడు. అదే రెస్టారెంట్ కి కావేరిని స్వప్న తీసుకొని వస్తుంది. వాళ్ళు రావడం చూసిన దీప.. శ్రీధర్ కి సైగ ద్వారా వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళను చూసిన శ్రీధర్ కంగారుగా మళ్ళీ వస్తానంటూ పక్కకు వెళ్తాడు. కావేరి స్వప్నలు కార్తీక్ వాళ్ళున్న వైపు వస్తుంటే.. మేనేజర్ ఆపుతాడు. దాంతో కార్తీక్ పిలిచి మనవాళ్లే పంపించమని చెప్పగానే వాళ్ళు లోపలికి వస్తారు.

ఒకే ఇంట్లో బర్రెలక్కతో కిర్రాక్ ఆర్పీ!

సీరియల్స్, కామెడీ అండ్ డ్యాన్స్, గేమ్ షోస్ ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకెత్తు బిగ్ బాస్ ఒక్కటే ఒకెత్తు.  తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుని  ఎనిమిదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్ళ పేర్లతో ఒక లిస్ట్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగు పెడతారనే టాక్ వినిపిస్తోంది.   యూట్యూబ్, ఇన్ స్టాతో ఫేమస్ అయిన ఇన్ఫ్లయెన్సర్లను ఎక్కువగా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకొచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.