English | Telugu
మళ్ళీ జబర్దస్త్ కి వెళ్ళను.. నా ఫోటోలని డస్ట్ బిన్ లో పడేసారు
Updated : Jun 21, 2024
జబర్దస్త్ ద్వారా ఎంతోమందికి ఫేమ్ వచ్చింది. వారిలో ముక్కు అవినాష్ ఒకడు. అయితే జబర్దస్త్ షో తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అవినాష్.. ఆ తర్వాత పలు షోలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.
మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. వాళ్ళ అమ్మ హాస్పిటల్ లో ఉందని వ్లాగ్ చేయగా చాలామంది స్పందించారు.
ఇక తాజాగా రీతు చౌదరి యాంకర్ గా చేస్తున్న 'దావత్' కి గెస్ట్ గా అవినాష్ వెళ్ళాడు. అక్కడ రీతు చౌదరి.. జబర్దస్త్ లోకి మళ్ళీ వెళతారా అనే క్వశ్చన్ అడుగగా.. ఎవరైన ముందుకు ఇలా ఇలా వెళ్ళాలనుకుంటారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళరు అని అవినాష్ చెప్పాడు. జబర్దస్త్ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు డబ్బులు కట్టి వెళ్ళావంట నిజమేనా అని రీతు అడుగగా.. అవును పది లక్షలు ఫైన్ కట్టి వెళ్ళానని అవినాష్ చెప్పాడు. అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నా లేదంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా అని అడుగగా.. అగ్రిమెంట్ చేయడం అని అవినాష్ అన్నాడు. చాలా కష్టాలు అనుభవించి వచ్చానని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఒక మూవీ ఆఫీస్ కి ఆడిషన్స్ కోసం వెళ్ళి తన ఫోటోలు ఇచ్చాడంట.. తను వెనక్కి తిరగగానే ఆ ఫోటోలని డస్ట్ బిన్ లో పడేసారంట. ఇక తాజాగా అదే ఆఫీస్ నుండి ఆడిషన్ కోసం తనకి కాల్ వచ్చిదంట. అది చాలా ప్రౌడ్ మూమెంట్ అని అవినాష్ చెప్పుకొచ్చాడు. దావత్ ప్రోగ్రామ్ లో రీతు అడిగే ప్రశ్నలు బోల్డ్ గా ఉంటాయి. తన డ్రెస్ కూడా అలాగే ఉంటుందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.