English | Telugu

మహేశ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న దేవిశ్రీ!

సినిమా వాళ్లని సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయా? సినిమా విడుదలకు ముందే జాతకం చెబుతున్నాయా? హీరో-దర్శకనిర్మాతలకు సెంటిమెంట్స్ తలనొప్పిగా మారాయా? అవుననే అంటున్నారంతా. లేటెస్ట్ గా మహేశ్ బాబు శ్రీమంతుడిపై అప్పుడే ఓ నెగిటివ్ సెంటిమెంట్ హల్ చల్ చేస్తోంది. శ్రీమంతుడి టీజర్ చూసి మహేశ్ లుక్ బావుందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ అని, కొరటాల శివ మరోసారి ఘాటుపుట్టిస్తాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇన్ని ప్లస్ లు ఉన్నా.....దేవిశ్రీ ప్రసాద్..... శ్రీమంతుడికి మైనస్ అవుతాడేమో అనే భయం కూడా ఫ్యాన్స్ ని వెంటాడుతోందట. ఎందుకంటే మహేశ్ కి గతంలో తమన్ ఇచ్చిన ట్యూన్స్ బాగోపోయినా....సినిమాలు హిట్టయ్యాయి. అదే దేవిశ్రీ ట్యూన్స్ హిట్టైనా సినిమా ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో విడుదలై ఫ్లాప్ అయిన మహేశ్-సుకుమార్ వన్ చిత్రం ఇందుకు నిదర్శనం అంటున్నారు. మరోవైపు కొరటాల మిర్చికి దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ అయింది కదా అనేవాళ్లూ లేకపోలేదు. మరి ఏ సెంటిమెంట్ నిజమవుతుందో వెయిట్ అండ్ సీ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.