English | Telugu

ప్రేమ‌లో హ‌రిప్రియ‌.. త్వ‌ర‌లో పెళ్లి!

పిల్ల‌జ‌మిందార్‌, అబ్బాయి క్లాసు అమ్మాయి మాసూ సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించిన హ‌రి ప్రియ గుర్తుందా?? కావ‌ల్సినంత గ్లామ‌ర్‌, న‌టించే టాలెంటూ రెండూ ఉన్న తెలుగులో గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది ఈ అమ్మాయి. అయితే క‌న్న‌డ‌లో మాత్రం క‌థానాయిక‌గా బాగానే రాణించింది. ఇప్పుడు ఈ నాయిక పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింద‌ని టాక్‌. అదీ క‌న్న‌డ హీరో ర‌క్షిత్‌తో. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని క‌న్న‌డ సీమ నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. హ‌రి ప్రియ ఇంట్లో కూడా ఈ పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. త్వ‌ర‌లోనే హ‌రిప్రియ నోటి నుంచి పెళ్లి క‌బురు వినే ఛాన్సుంది.