English | Telugu

వ్య‌భిచారం కేసులో మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌

సినీ ప‌రిశ్ర‌మ ఓ మేడి పండు. అన్నీ పైపై సొబ‌గులే. లోప‌ల మొత్తం పురుగుల పుట్ట‌. కొంత‌మంది క‌థానాయిక‌లు అడ్డ‌దారులు తొక్కుతూ.. సినీ ప‌రిశ్ర‌మ‌కి మ‌రింత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ క‌థానాయిక బ్రోత‌ల్ కేసులో ప‌ట్టుబ‌డి.. వార్త‌ల‌కెక్కింది. ఆ విష‌యం ఇంకామ‌రుగున ప‌డ‌క‌ముందే మ‌రో క‌థానాయిక కూడా వ్య‌భిచారం కేసులో అరెస్ట‌య్యింది. తెలుగు, హిందీ చిత్రాల‌తో కాస్త పేరు తెచ్చుకొని, ఇప్పుడు అవ‌కాశాలు లేక అల్లాడుతున్న ఓ క‌థానాయిక ని వ్య‌భిచారం కేసుపై గోవా పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆమె పేరు చెప్ప‌డానికి నిరాక‌రించారు. గోవాలోని ఓ స్టార్ హోట‌ల్‌లో ఈ క‌థానాయిక వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిపోయింది. అయితే తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌ని అడ్డంగా ఈ కేసులో బుక్ చేశార‌ని ఆమె ఆరోపిస్తోంది. హోటల్ రూమ్ విటుడి పేరుతోనే బుక్ అవ్వ‌డం, ఆ గ‌దిలో ల‌క్ష‌ల రూపాయ‌ల క్యాష్ దొర‌క‌డంతో ఈ క‌థానాయిక ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. మ‌రి ఆ క‌థానాయిక ఎవర‌నేదే ప్ర‌స్తుతం స‌స్పెన్స్‌గా మారింది. పోలీసులు ఏ పేరు బ‌య‌ట‌పెడ‌తారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.