English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ కపట డ్రామా...
Updated : Sep 6, 2024
బిగ్ బాస్ సీజన్ మొదలయ్యి అప్పుడే నాలుగు రోజులు కంప్లీట్ అయ్యాయి. ఇక నాల్గో రోజు హౌస్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. ఉదయమే బిగ్ బాస్ మంచి జోష్ సాంగ్ తో అందరిని నిద్ర లేపాడు.
రాత్రి నామినేషన్ల టైమ్ లో విష్ణుప్రియ, మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి మణికంఠ తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ షో నుంచి బయటికెళ్లాక నా వైఫ్ యాక్సెప్ట్ చేయదు.. నా మిస్టేక్ కదా నెగెటివ్‌గా ఆలోచించే పర్సనాలిటీ నాది.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. లేదు తను అది అర్థం చేసుకుంటుందిలే అంటూ విష్ణుప్రియ కాసేపు సర్ది చెప్పింది. కానీ నా వల్ల వాళ్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మణికంఠ మళ్లీ ఏడ్చేశాడు. మరోవైపు నైనికతో నిఖిల్ సరదాగా మాట్లాడాడు. చెప్పు మీ అబ్బాయి పేరు చెప్పమనగా నైనిక సిగ్గుపడింది.
మణికంఠకి ప్రేరణ కాసేపు ధైర్యమిచ్చింది. ఆ తర్వాత ఆదిత్య కూడా మణికంఠ దగ్గరికొచ్చి మాట్లాడాడు. నా లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు.. హార్ట్ ఫెల్ట్‌గా నీకు కనెక్ట్ అయ్యాను మణి.. ఒకటి గుర్తుపెట్టుకో పబ్లిక్ నిన్ను కాపాడతారు.. అంతకంటే నేను చెప్పనంటూ ధైర్యం చెప్పి ఆదిత్య వెళ్లిపోయాడు. కానీ దీనికి కూడా మణికంఠ మళ్లీ ఏడుస్తూ ఈ రోజు నుంచి ఏడవొద్దని ఫిక్స్ అయ్యా అంటూ బిగ్‌బాస్‌తో అన్నాడు.
ఇక తర్వాత అందరిని కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటో చెప్పాడు బిగ్‌బాస్. ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు కాబట్టి వీళ్లకి సైన్యం కూడా ఉండాలి. కనుక వీళ్ల ముగ్గురు తమ టీమ్‌లని రెడీ చేసుకుంటారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అయితే నబీల్, శేఖర్, బేబక్కలకి బిగ్‌బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఒక్క అడుగు దూరంలో చీఫ్‌లు అవ్వకుండా ఆగిపోయారు కాబట్టి వీళ్లు వాళ్లకి నచ్చిన చీఫ్ టీమ్‌లో చేరే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ తర్వాత ఒక్కో టీమ్ లోకి ఒక్కో కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు.